దిశ చిత్ర విడుదల ఆపాలంటూ కోర్టు ఆదేశాలు... కానీ ఆర్జీవీ మాత్రం...

సినిమా పరిశ్రమలో ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో సావాసం చేస్తూ, సంచలన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం సోషల్ మీడియా మాధ్యమాలను వార్తల్లో నిలిచే టాలీవుడ్ ప్రముఖ వివాదాస్పద దర్శకుడు “రామ్ గోపాల్ వర్మ” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ కరోనా కాలంలో సినిమా థియేటర్లు మూత పడినప్పటికీ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రాలను ఆన్ లైన్ మాధ్యమాలలో విడుదల చేస్తూ ప్రేక్షకులని బాగానే అలరిస్తున్నాడు.

 Court Passed The Order For Stop Disha Encounter Movie Release, Disha Encounter,-TeluguStop.com

 ఇప్పటికే పవర్ స్టార్, త్రిల్లర్, నగ్నం,  తదితర చిత్రాలతో బాగానే ప్రేక్షకులనిఅలరించి సొమ్ము చేసుకున్నాడు.

అయితే ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ సమర్పణలో “దిశ ఎన్కౌంటర్” అనే చిత్రానికి నూతన దర్శకుడు ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు.

కాగా ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు పూర్తయినప్పటికీ పలు అనివార్య కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు. ఈ చిత్రం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో ప్రియాంక రెడ్డి అనే యువతిని ఐదుగురు నిందితులు దారుణంగా అత్యాచారం చేసి ఆపై ఆమెను సజీవ దహనం చేశారు.

Telugu Disha, Ram Gopal Varma, Telugu, Tollywood-Movie

ఈ యదార్థ ఘటన ఆధారంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. దీంతో ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను కూడా విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఈ చిత్ర విడుదలను నిలిపివేయాలంటూ దిశ కుటుంబ సభ్యులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీంతో తాజాగా ఈ పిటిషన్ కి సంబంధించిన విచారణను కోర్టులో జరిపారు.

 అయితే ఇందులో ఇరువురి వాదనలను విన్నటువంటి కోర్టు ఈ విషయంపై విచారణ పూర్తి అయ్యేంతవరకూ చిత్ర విడుదలను తాత్కాలికంగా నిలిపివేయాలని చిత్ర యూనిట్ సభ్యులకు సూచించింది.అంతేగాక మళ్లీ రెండు వారాల తర్వాత మరోమారు వాయిదా కి హాజరు కావాలని సూచించింది.

దీంతో ఈ చిత్రం విడుదలపై ఆసక్తి నెలకొంది.ఈ విషయం ఇలా ఉండగా ఆ మధ్య  తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాల గూడ పరిసర ప్రాంతంలో చోటు చేసుకున్నటువంటి ఓ యథార్థ సంఘటన ఆధారంగా “మర్డర్” అనే చిత్రాన్ని తెరకెక్కించారు.

కానీ చిత్రం విడుదలను కూడా కోర్టు నిలిపి వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube