ఇయర్ ఫోన్స్ అతిగా ఉపయోగిస్తున్నరా జాగ్రత్త సుమా..!

ప్రస్తుతం రోజు రోజుకి ఇయర్ ఫోన్స్ ఉపయోగించే వారి సంఖ్య అమాంతం పెరిగిపోతుంది.ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో భాగంగా చాలా మంది వర్క్ ఫ్రొం హోమ్ చేస్తున్న నేపథ్యంలో ఎక్కువగా పనిలో భాగంగా ఇయర్ ఫోన్స్ ఉపయోగించడం చాలా ఎక్కువ గా మారింది.

 Ear Phones, Using More, Be Care Ful, Technology News, Covid 19, Ear Phone Disadv-TeluguStop.com

ఇయర్ ఫోన్స్ ఉపయోగించకపోతే పని జరగదు.ఇయర్ ఫోన్స్ ఎక్కువ ఉపయోగిస్తే అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది చాలా మంది.

ఎక్కువ సేపు ఇయర్ ఫోన్స్ ఉపయోగించేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు వైద్యనిపుణులు.ఈ మధ్యకాలంలో కరోనా వైరస్ కారణంగా ఆన్లైన్ తరగతులు అలాగే వర్క్ ఫ్రొం హోమ్ పెరిగిపోవడంతో సంబంధించిన సమస్యలతో ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

ఈ విషయానికి సంబంధించి తాజాగా ముంబై నగరంలో కొంతమంది నిపుణులు పలు విషయాలను తెలిపారు.

కరోనావైరస్ మొదలైనప్పటి నుంచి చాలామంది ఇంటి దగ్గర ఉండి పని చేస్తున్న నేపథ్యంలో ఎక్కువగా ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ ఉపయోగించి వారి పనులను చేయాల్సి వస్తుంది.

ఇందులో భాగంగానే చాలామంది రోజుకి ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు వారి పనుల కోసం ఇయర్ ఫోన్స్ ను అదే పని గా ఉపయోగించడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి పరిస్థితి ఏర్పడుతుంది.గడిచిన నాలుగైదు నెలల నుండి చెవికి సంబంధించిన కేసులు మరి ఎక్కువగా వస్తున్నాయని వైద్య నిపుణులు వారి సంఖ్యను తెలుపుతున్నారు.

ఇదివరకు రోజులకంటే ఈ మధ్యకాలంలో చెవికి సంబంధించిన రోగులు రోజుకి ఐదు నుంచి పది మంది వ్యక్తులు కొత్తగా వస్తున్నారని వైద్యులు అధ్యయనం చేశారు.

Telugu Care Ful, Covid, Ear-Latest News - Telugu

ఇందులో ఎక్కువగా పనిలో భాగంగా 8 గంటల పాటు ఇయర్ ఫోన్స్ ఉపయోగించే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నారని వారు తెలుపుతున్నారు.అలా ఎక్కువగా ఇయర్ ఫోన్స్ తో పనిచేయడం వల్ల చెవులకు ఒత్తిడి ఏర్పడి అది చివరికి ఇన్ఫెక్షన్ కు దారి తీస్తున్న నేపథ్యంలో కేసులు పెరుగుతున్నట్లు వైద్య నిపుణులు తెలుపుతున్నారు.అలాంటివారు వీలైనంతవరకు ఇయర్ ఫోన్స్ వాడకాన్ని తగ్గించుకోవాలి.

లేకపోతే ఫ్యూచర్లో శాశ్వత సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువ ఉందని శాస్త్రవేత్తలు చెపుతున్నారు.ఇక చిన్నపిల్లలైతే హెడ్ ఫోన్స్ నుండి కేవలం 60 డెసిబుల్స్ కన్నా ఎక్కువ శబ్దాన్ని వినకూడదు.

ఒకవేళ మించితే అది చిన్న పిల్లలకి చెవులపై దెబ్బతీస్తుందని వైద్యులు తెలుపుతున్నారు.వీలైతే తల్లిదండ్రులు పిల్లలు ఆన్లైన్లో తరగతులను వినిపించే సమయంలో లో కాస్త సౌండ్ తక్కువ మోతాదులో ఉంచి వినిపిస్తే వారికి సంబంధించిన వ్యాధుల నుంచి తప్పించే వారిమి అవుతామని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube