రెండు వారాల గ్యాప్‌ తర్వాత మళ్లీ ఆర్‌ఆర్‌ఆర్‌ లో జాయిన్‌ కాబోతున్న కొమురం భీమ్‌

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది.ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ హైదరాబాద్‌ లో ప్రత్యేకంగా వేసిన సెట్టింగ్‌ లో జరుపుతున్నారు.

 After Dubai Trip Ntr Join Again In Rajamouli Rrr Shooting, Ntr , Ntr And Ram Cha-TeluguStop.com

రాత్రి సమయంలో జరుపుకుంటున్న షూటింగ్‌ లో యూనిట్‌ సభ్యులు చలికి వణుక్కుంటూ మరీ పాల్గొంటున్నారు.గత రెండు వారాలుగా షూటింగ్‌ లో ఎన్టీఆర్‌ పాల్గొనడం లేదు.

ఇటీవలే ఆయన దుబాయి వెళ్లాడు.కుటుంబ సభ్యులతో హాలీడే ట్రిప్‌ వెళ్లిన ఎన్టీఆర్‌ తాజాగా హైదరాబాద్‌ చేరుకున్నాడు.

ఒకటి లేదా రెండు రోజుల గ్యాప్‌ తర్వాత మళ్లీ ఎన్టీఆర్‌ షూటింగ్‌ లో జాయిన్‌ అవ్వబోతున్నాడు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

హీరోయిన్స్‌ మరియు రామ్‌ చరణ్‌ల మద్య సీన్స్‌ ను చిత్రీకరించిన దర్శకుడు రాజమౌళి ఇప్పుడు ఎన్టీఆర్‌ రాకతో సినిమా షూటింగ్‌ను మరింత జోష్‌ తో ముందుకు తీసుకు వెళ్లబోతున్నాడు.రాజమౌళి ఈ సినిమాను అత్యంత విభిన్నమైన కథతో ఎవరు ఊహించని కథనంతో తెరకెక్కిస్తున్నాడు.

ఎన్టీఆర్‌ ఈ సినిమాలో కొమురం భీమ్‌ గా నటిస్తున్నాడు.కాని కొమురం భీమ్‌ ను ముస్లీం పాత్రలో చూపించడంతో అసలు జక్కన్న చూపించబోతున్నది ఏంటీ అంటూ అంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.

రికార్డు స్థాయి బడ్జెట్‌ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ ను మార్చి వరకు పూర్తి చేసి వచ్చే ఏడాది అక్టోబర్‌ లో విడుదల చేయాలని జక్కన్న ప్లాన్‌ గా తెలుస్తోంది.అందుకోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

సినిమా మార్చి లో పూర్తి అయితే వెంటనే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటించేందుకు ఎన్టీఆర్‌ సిద్దంగా ఉన్నాడు.రాబోయే మూడు నాలుగు నెలల పాటు ఫుల్‌ బిజీగా ఉంటుంది.

ప్రయాణాలకు వీలు పడదు.అందుకే ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులతో కలిసి దుబాయి చెక్కేసి వారం పది రోజులు ఎంజాయ్‌ చేసి వచ్చేశాడు.

మళ్లీ ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌ లుక్‌ లోకి మారబోతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube