పంజాబ్ స్టేట్ ఐకాన్ గా సోనూసూద్

కరోనా లాక్ డౌన్ కి ముందు ఒక నటుడుగా మాత్రమే అందరికి సుపరిచితం అయినా సోనూసూద్ ఈ ఆరు నెలల కాలంలో ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. కరోనా లాక్ డౌన్ లో వలస కార్మికులకి అండగా ఉండి వారిని గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా ఒక్కసారిగా నేషనల్ హీరోగా మారిపోయిన సోనూసూద్ తరువాత దాతృత్వంలో కలియుగ దానకర్ణుడు అనిపించుకున్నాడు.

 Sonu Sood Appointed As State Icon Of Punjab, Tollywood, Bolllywood, Real Hero, H-TeluguStop.com

సాయం అంటూ తన దగ్గరకి వచ్చే ప్రతి ఒక్కరి కష్టాన్ని తెలుసుకుంటూ మీకు అండగా నేనున్నా అంటూ సాయం చేస్తున్నాడు.వారి కష్టాన్ని తీరుస్తున్నాడు.

ఈ ఆరు నెలల కాలంలో సోనూసూద్ సాయం పొందిన వారి గురించి చెప్పాలంటే లెక్కలు సరిపోవు.ఏదో ఒక రూపంలో ఏదో ఒక సందర్భంగా అతను సాయం చేస్తూనే ఉన్నాడు.

కష్టం తన దృష్టికి వస్తే చూస్తూ ఉండలేనని సోనూసూద్ అతని మాటల్లోనే చెప్పాడు.దీంతో సినిమాలలో విలన్ గా నటిస్తున్న నిజజీవితంలో మాత్రం సోనూసూద్ రియల్ హీరో అనిపించుకున్నారు.

Telugu Bolllywood, Sonu Sood, Icon Punjab, Tollywood-Movie

అతని ద్వారా సాయం పొందిన వారు ఏదో ఒక రూపంలో అతని సాయాన్ని గుర్తు చేసుకుంటున్నారు.తన ద్వారా సాయం పొందిన ఎవరైనా అవకాశం ఉంటే మరొకరికి అండగా ఉండాలని సోనూ చెబుతున్నాడు.కోట్లకి కోట్లు ఆదాయం తీసుకుంటున్న స్టార్ హీరోలు, వ్యాపారవేత్తలు తమ కష్టార్జితంలో ఎంత సాయం చేస్తారో తెలియదు కానీ ఒక సాధారణ నటుడుగా ఉన్న సోనూ మాత్రం దాతృత్వంలో అందరిని మించిపోయాడు.అందుకే సోషల్ మీడియాలో కూడా స్టార్ హీరోలని మించిపోయి ట్రెండింగ్ స్టార్ అయిపోయాడు.

ఇదిలా ఉంటే సోనూకు తాజాగా అరుదైన గౌరవం దక్కింది.ఈయనకు పంజాబ్ స్టేట్ ఐకాన్ గా భారత ఎన్నికల సంఘం నియమించినట్లు ప్రకటించింది.

ఈ ప్రతిపాదనను కేంద్ర ఎన్నికల సంఘం అంగీకరించిందని పంజాబ్ స్టేట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పేర్కొన్నారు.సోనూ సూద్ పంజాబ్ రాష్ట్రంలోని మోగా జిల్లాకు చెందిన వ్యక్తి అన్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube