ప్రగతి హీరోయిన్ గా నటిస్తోందటగా...

తెలుగులో పలు చిత్రాల్లో అమ్మ, అక్క, చెల్లి, వదిన తదితర పాత్రలలో నటించి తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న “సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నటి ప్రగతి మొదట్లో పలు తెలుగు, తమిళ చిత్రాలలో హీరోయిన్ గా కూడా నటించింది.

 Telugu Character Artist Pragathi Got A Heroine Chance, Pragathi, Telugu Characte-TeluguStop.com

 కానీ ఆ చిత్రాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకే పరిమితమైంది.

అయితే తాజాగా ప్రగతి గురించి ఓ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

ఇంతకీ ఆ వార్త ఏమిటంటే నటి ప్రగతి ఓ తెలుగు చిత్రంలో హీరోయిన్ గా నటించబోతుందని అంతేగాక ఈ చిత్రానికి గతంలో ఓ ప్లాప్ చిత్రానికి దర్శకత్వం వహించిన  దర్శకుడు దర్శకత్వం వహించనున్నాడని పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అందువల్లే ఈ మధ్యకాలంలో నటి ప్రగతి బరువు పెరగడంతో రోజులో ఎక్కువ శాతం సమయాన్ని జిమ్ లో గడుపుతూ బరువు తగ్గేందుకు వర్కౌట్లు చేస్తోందని కూడా కొంతమంది సోషల్ మీడియా మాధ్యమాలలో చర్చించుకుంటున్నారు.

అయితే నటి ప్రగతి హీరోయిన్ గా నటిస్తున్నట్లు వస్తున్నటువంటి వార్తలపై ఇప్పటి వరకు ఇటు ప్రగతి గాని లేదా చిత్ర యూనిట్ సభ్యులు గానీ స్పందించ లేదు. దీంతో ఈ వార్తలలో నిజమెంతుందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నటి ప్రగతి పలు టాలీవుడ్ చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటిస్తోంది.అంతేగాక అప్పడప్పుడూ ఆరోగ్యం మరియు యోగా కి సంబంధించినటువంటి సలహాలు సూచనలిస్తూ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube