చెవుల్లో ఆ శబ్దం వినిపించినా కరోనా సోకినట్లే..?

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది.దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య తగ్గినా పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.

 Corona Could Make Your Ears Ring Or Buzz, Corona Virus, Corona Effect, Ears, Sou-TeluguStop.com

వ్యాక్సిన్ వస్తే మాత్రమే ఈ వైరస్ ను కట్టడి చేయగలమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.ఇప్పటికే ఈ మహమ్మారికి సంబంధించిన ఎన్నో లక్షణాలు వెలుగులోకి రాగా శాస్త్రవేత్తలు తాజాగా కరోనా రోగుల్లో మరో కొత్త లక్షణాన్ని గుర్తించారు.

చెవుల్లో ఏదైనా శబ్దం పదేపదే వినిపిస్తుంటే కరోనా పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.చెవుల్లో నుంచి ఏవైనా వింత శబ్దాలు వినిపిస్తుంటే కరోనా కావచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

తాజాగా శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.కరోనా సోకిన వాళ్లలో కొన్ని రోజుల పాటు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

బ్రిటన్ టిన్నిటస్ అసోసియేషన్, అమెరికన్ టిన్నిటస్ అసోసియేషన్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా అధ్యయనం చేసి కరోనా కొత్త లక్షణాన్ని గుర్తించారు.వారం రోజుల క్రితం ఫ్రాంటియర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ అనే ప్రముఖ జర్నల్ లో ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలు ప్రచురితమయ్యాయి.

కరోనా సోకిన వాళ్లలో దాదాపు 40 శాతం మందికి చెవుల్లో వింత శబ్దాలు వినిపించాయి.

తమకు కరోనా సోకిన తరువాతే ఈ లక్షణం కనిపిస్తోందని వైరస్ నిర్ధారణ అయిన బాధితులు చెబుతున్నారు.

మరోవైపు కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో కొంతమందిలో వినికిడి సమస్యలు కనిపిస్తున్నాయని.స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకునే వాళ్లలో ఎక్కువగా ఈ సమస్యలు గుర్తిస్తున్నామని శాస్త్రవేత్తలు తెలిపారు.

జీవన శైలి, ఆహారపు అలవాట్లు భిన్నంగా ఉండే వాళ్లకు కరోనా సోకితే చెవుల్లో వింత శబ్దాల లక్షణం కనిపిస్తూ ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.గతంలో కూడా అనేక వైరస్ లు వినికిడి సమస్యలకు కారణమయ్యాయని కొందరికి మాత్రం కరోనా సోకకపోయినా వింతశబ్దాలు వినిపిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube