అక్కాచెల్లెళ్లు ఒకే హీరోతో రెండు సినిమాలు

యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ కూతుళ్లు శివాని, శివాత్మిక హీరోయిన్లుగా టాలీవుడ్ లో సక్సెస్ కావాలని ప్రయత్నాలు చేస్తున్నారు.తల్లి తరహాలో తాము కూడా మంచి హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటున్నారు.

 Shivani And Shivathmika Paired To Young Hero Adhiti Arun, Tollywood, Telugu Cine-TeluguStop.com

శివాని, అడవి శేష్ కి జోడీగా హిందీ రీమేక్ లో నటించింది.అయితే ఏ కారణాల వలనో ఆ సినిమా ఆగిపోయింది.

రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక మాత్రం సురేష్ ప్రొడక్షన్ లో దొరసాని సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసి నటిగా మంచి మార్కులు వేయించుకుంది.కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తాండ సినిమాలో కూడా నటించే అవకాశాన్ని కొట్టేసింది.

అయితే అక్క శివాని మాత్రం మంచి ఎంట్రీ కోసం ఎదురుచూస్తుంది.ఈ నేపధ్యంలో కుర్ర హీరో అదితి అరుణ్ కి జోడీగా ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతుంది.

కెమెరామెన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న కెవి గుహన్ 118 సినిమాతో దర్శకుడుగా కూడా మారాడు.అయితే ఆ సినిమా అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు.

ఈ నేపధ్యంలో ఈసారి చిన్న సినిమా ప్లాన్ చేసి ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.ఈ సినిమాలో అదితీ అరుణ్, శివాని రాజశేఖర్ జోడీగా నటిస్తున్నారు.

ఈ సినిమా కూడా మొదటి తరహాలో కాకుండా టెక్నో థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కింది.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది.

ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉంది.ఇదిలా ఉంటే అదితీ అరుణ్ తో రాజశేఖర్ చిన్న కూతురు, శివాని చెల్లెల్లు శివాత్మిక విధి విలాసం అనే సినిమాలో నటిస్తుంది.

ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతుంది.ఒకే హీరోతో రాజశేఖర్ ఇద్దరు కూతుళ్లు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేయడం విశేషమని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube