టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ప్రతి సీన్ ను కూడా తనకు కావాల్సిన విధంగా తెచ్చుకునేందుకు నటీనటులను ఎంతగా చెక్కుతాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆయన అంతగా చెక్కడం వల్లే బాహుబలి ఆ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది అనడంలో సందేహం లేదు.
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా కు గాను జక్కన్న పని చేస్తున్నాడు.ఈయన ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్‌లతో ఈ సినిమాను చేస్తున్నాడు.
రికార్డు స్థాయి బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో పలువురు ముఖ్య నటీనటులు కనిపించబోతున్నారు.ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడం, మలయాళంలో విడుదల చేయాలని భావిస్తున్నారు.
అందుకు సంబంధించిన డబ్బింగ్ పనులు ఇప్పటి నుండే మొదలు పెట్టారు.ఎవరు పోషిస్తున్న పాత్రకు వారే అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పాలంటూ ముందే జక్కన్న కండీషన్ పెట్టాడు.
దాంతో అంతా కూడా భాషలపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
హీరోలు ఇద్దరు కూడా అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పబోతున్నారు.
ఇక హీరోయిన్స్ ముఖ్యంగా ఫారిన్ హీరోయిన్స్ వారి వారి పాత్రలకు గాను వారే డబ్బింగ్ చెప్పబోతున్నారు.వారు ఎక్కువగా ఇంగ్లీష్ లో మాట్లాడే అవకాశం ఉంది.
వారితో తెలుగు కూడా మాట్లాడించబోతున్నారు.తెలుగు భాషలో మాత్రమే కాకుండా వారు ఇతర భాషల్లో కూడా స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది.
అందుకు గాను వారు చాలా కష్టపడాల్సి ఉంటుంది.భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమాను రికార్డు స్తాయి వసూళ్లు సాధించిన సినిమాగా నిలపాలనే ఉద్దేశ్యంతో జక్కన్న ఈ సినిమాను చాలా కష్టపడి తెరకెక్కిస్తున్నాడు.
అంతా సవ్యంగా జరిగి ఉంటే వచ్చే సంక్రాంతికి వచ్చేది.కాని కరోనా కారణంగా ప్లాన్ రివర్స్ అయ్యింది.
వచ్చే ఏడాది చివరి వరకు సినిమా వస్తుందేమో చూడాలి.