అల్లుడు అలా చేశాడు.. జ‌గ‌న్ ఇలా చేశాడు.. ఎన్టీఆర్‌ మ‌ళ్లీ పుట్టాలా..?

ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు పాల‌న‌తో ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తోంద‌నే విమ‌ర్శ‌లు విన్నాం.కానీ.

 Jagan Doing Like This,chandra Babu Doing Like That,is Ntr Again Re Birth..?, And-TeluguStop.com

జ‌గ‌న్ పాల‌న‌తోనూ ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తోందా? ఇదెలా?! అని అనుకుంటున్నారా? ఇది నిజ‌మేన‌ని అంటున్నారు అన్న‌గారి అభిమానులు.సీనియ‌ర్ రాజ‌కీయ పండితులు.

అంతేకాదు.రాష్ట్రం విడిపోయిన త‌ర్వాత‌.

గ‌డిచిన ఏడేళ్ల పాల‌న‌లో అన్న ఎన్టీఆర్ ఆత్మ నిత్యం ఘోషిస్తూనే ఉంద‌ని కూడా చెబుతున్నారు.ఈ ప‌రిణామాలు చూస్తే.

అన్న ఎన్టీఆర్ మ‌ళ్లీ పుట్టాల‌ని తాము కోరుకుంటున్న‌ట్టు కూడా వారు చెబుతు న్నారు.మ‌రి ఇంత‌కీ.

ఏం జ‌రుగుతోంది? ఎందుకు ఇలా.ఇప్పుడు హ‌ఠాత్తుగా అన్న‌గారు మ‌ళ్లీ పుట్టాల‌ని కోరుకునేవారు పెరుగుతున్నారు? అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌స్తోంది

ముందు.చంద్ర‌బాబు పాల‌న గురించి మాట్లాడుకుందాం.విభ‌జిత ఏపీని ముందుకు న‌డిపిస్తార‌ని.

ఏపీని స‌ముద్ధ‌ర‌ణ స్థాయికి తీసుకువెళ్తార‌ని.ఆశించి.

ఏపీ ప్ర‌జ‌లు చంద్ర‌బాబుకు ప‌ట్టం క‌ట్టారు.అయితే, ఆయ‌న కొంత మేర‌కు చేశారు.

కానీ.ఈ చేయ‌డంలోనే ఆయ‌న కొన్ని విష‌యాల్లో రాజీ ప‌డిపోయారు.

ప్ర‌త్యేక హోదాను సాధించ‌లేక పోయారు.దాయాది రాష్ట్రం తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బ‌కాయి రు.5700 కోట్ల‌ను రాబ‌ట్ట‌లేక పోయారు.ఉమ్మ‌డి స‌చివాల‌యంలో హ‌క్కుగా ఉన్న భూమి తాలూకు నిధులు, కార్యాల‌యాల‌ను వ‌దిలేసుకున్నారు.ఇవి ఎంత లేద‌న్నా.10 వేల కోట్ల పైచిలుకు ఉంటాయి.అంతేకాదు.అడుగ‌డుగునా.కేంద్రం ముందు సాగిలప‌డ్డారు

Telugu Andhra Pradesh, Chandra Babu, Nandamuri, Senior Ntr, Tdp Founder-Telugu P

ఇక‌, జ‌గ‌న్ పాల‌న చూద్దాం… అధికారంలోకి వ‌చ్చాక ఏదో చేస్తాన‌ని చెప్పిన జ‌గ‌న్‌.హోదా విష‌యాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు అడ‌గ‌డం లేదు.కేంద్రం నుంచి పోల‌వ‌రం నిధుల‌ను ర‌ప్పించుకోలేక పోతున్నారు.ఏపీ ప్ర‌జ‌ల వాయిస్‌ను కేంద్రం వ‌ద్ద వినిపించ‌లేక పోతున్నారు.ఇక‌, పొరుగు రాష్ట్రం తెలంగాణ వ‌ద్ద కూడా ఏపీకి రావాల్సిన అవే విద్యుత్ బ‌కాయిలు రు.5700 కోట్ల‌ను ఇప్ప‌టి వర‌కు వసూలు చేసుకోలేక పోతున్నారు.ఆర్టీసీ విష‌యంలోనూ సాగిల‌ప‌డ్డారు.నీళ్ల విష‌యంలోనూ తెలంగాణ‌తోను, అటు కేంద్రంతోనూ పోరాడ‌లేక చేతులు ఎత్తేస్తున్నారు

ఇప్పుడు అన్న‌గారు ఎందుకు పుట్టాల‌ని అంటున్నారో చూద్దాం.అన్న ఎన్టీఆర్‌.సీఎం ప‌ద‌వి క‌న్నా ఎక్కువ‌గా తెలుగు వారి ఆత్మ‌గౌర‌వానికి ప్రాధాన్యం ఇచ్చారు.

తెలుగు ఎక్కడున్నా త‌లెత్తుకుని నిల‌బ‌డాల‌ని పిలుపునిచ్చేవారు.ఆ విధంగానే ఆయ‌న పాల‌న సాగించారు.అప్ప‌ట్లో పేద‌ల‌కు(ఉమ్మ‌డి రాష్ట్రం) రూ.2 కే కిలో బియ్యం ఇస్తాన‌ని ఆయ‌న హామీ ఇచ్చారు.అయితే, దీనికి కేంద్రంలోని ఇందిర‌మ్మ ప్ర‌భుత్వం మోకాల‌డ్డింది.బియ్యం కోటా పెంచేది లేద‌ని స్ప‌ష్టం చేసింది.దీంతో ఆయ‌న ఆమెపై పోరాడి.దీనిని సాధించారు

పీవీ న‌ర‌సింహారావు పీఎంగా ఉండ‌గా.

పంచ‌దార కోటా త‌గ్గించ‌డంపైనా పోరాడి సాధించారు.ఎక్క‌డా రాజీ ప‌డ‌లేదు.

ఎక్క‌డ అవ‌స‌ర‌మైతే.అక్క‌డ తెలుగువారి పౌరుషాన్ని చూపించారు.

కానీ, ఆయ‌న అల్లుడు చంద్ర‌బాబు.ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌పై భ‌క్తి ప్ర‌ద‌ర్శించే (కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడ‌తానని ప్ర‌క‌టించారు) జ‌గ‌న్‌.

తెలుగు వారి ఆత్మ గౌర‌వాన్ని అటు ఢిల్లీలోనూ.ఇటు తెలంగాణ‌లోనూ.

ప‌డుకోబెడుతున్నారని.అందుకే ఇప్పుడు ఎన్టీఆర్‌లా ఫైట్ చేసే నేత ఏపీకి కావాల‌న్న చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube