టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.హాస్యబ్రహ్మ గా పేరు తెచ్చుకున్న ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో భారీ విజయాలు పొందిన చిత్రాలలో కమెడియన్ గా నటించి ఎంతో మందిని తన హాస్యానికి అభిమానులుగా మార్చుకున్నాడు.
కొన్నిసార్లు సినిమా కథలో పట్టు లేకపోయినా సరే కేవలం తన కామెడీతో వారి సినిమాలను హిట్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదేమో.కొంతమంది దర్శకులు కేవలం బ్రహ్మానందం కోసమే విభిన్నమైన కామెడీ ప్రయత్నించేవారు.
అంతే కాదు సినిమాలో బ్రహ్మానందం నటిస్తే ఆ సినిమా ఎలాగైనా ఆడుతుందని ఎంతో మంది దర్శక నిర్మాతలు నమ్మేవారు ఉన్నారు.
ఈ మధ్యకాలంలో జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రజలకు ఎంతగానో సుపరిచితడైన వ్యక్తి హైపర్ ఆది.
జబర్దస్త్ షో లో తనదైన స్టైల్ లో కామెడీ పంచుల వర్షం కురిపిస్తూ ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలను హైపర్ ఆది చొరగొన్నాడు.అయితే అప్పుడప్పుడు ఈయన కామెడీలు కాంట్రవర్సీ అయిన సంఘటనలు కూడా ఉన్నాయి.
అప్పట్లో ఓ సారి కత్తి మహేష్ లాంటి వాళ్లను జబర్దస్త్ షో లో దారుణంగా ట్రోల్ చేసి ఆ తర్వాత పెద్ద యుద్ధ వాతావరణంగా తయారైపోయింది.ఇన్ని జరిగినా కానీ తన రూటే సపరేటు అంటూ తన మార్క్ పంచ్ డైలాగులను వేసి తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.
ఓసారి అనుకోకుండా లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం కి హైపర్ ఆది చుక్కలు చూపించాడట.అయితే ఆ విషయాన్ని హైపర్ ఆదినే స్వయంగా చెప్పడం విశేషం.ఈ మధ్యకాలంలో ఓ షో ఇంటర్వ్యూకు వచ్చిన ఆది తనకు ఎదురైన విచిత్రమైన సంఘటన గురించి చెప్పుకొచ్చాడు.
ఆ సంఘటనకు సంబంధించి ఓ సారి హాస్యబ్రహ్మ బ్రహ్మానందం గారు తనకి కాల్ చేస్తే ఎవరో అనుకొని తాను చాలా ఘోరంగా మాట్లాడానని చెప్పుకొచ్చాడు.
ఫోన్ లో మొదట్లో తాను బ్రహ్మానందం అంటూ వాయిస్ వచ్చిందని.అది విన్న హైపర్ ఆది అయితే ఏంటి నేను ఇక్కడ హైపర్ ఆది అంటూ సమాధానం ఇచ్చానని చెప్పుకొచ్చాడు.
అయినా దాన్ని నటుడు బ్రహ్మానందం చాలా శాంతంగా అది కాదయ్యా.నేను బ్రహ్మానందాన్ని మాట్లాడుతున్న అని చెప్పినా కూడా అంటే, అయితే నేను కూడా హైపర్ ఆది ని మాట్లాడుతున్న అంటూ సమాధానం ఇచ్చినట్లు ఆది తెలిపాడు.
దాంతో బ్రహ్మానందం ఒకసారి గట్టిగా సీరియస్ గా తాను బ్రహ్మానందం అని చెప్పడంతో అప్పుడు విషయం బోధపడి ఆయనకు వెంటనే క్షమాపణ చెప్పానని తెలిపాడు.అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్ ఆట పట్టించడానికి ఎవరో ఒకరు ఇలా ఫోన్ చేయడం కామన్ గా మారడంతో ఆ రోజు బ్రహ్మానందం గారితో తాను దురుసుగా ప్రవర్తించినట్లు తెలియజేశాడు.
ఇప్పటికి కూడా ఆ సంఘటనను గుర్తు చేసుకొని నవ్వుకుంటారని ఆది తెలిపాడు.