ఎఫ్3లో మూడో వాడు లేడంటోన్న వెంకీ

టాలీవుడ్‌లో తెరకెక్కిన ఫుల్టూ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ‘ఎఫ్2’ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్‌లు కలిసి చేసిన హంగామా ఎలాంటిదో అందరం చూశాం.

 Venkatesh Reveals Updates On F3, Venkatesh, F3, Varun Tej, Anil Ravipudi, Tollyw-TeluguStop.com

దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలవడంతో, ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు దర్శకుడు ప్లాన్ చేశాడు.

అయితే కొన్ని కారణాల వల్ల ఈ సీక్వెల్ చిత్రాన్ని ముందుగా అనుకున్న సమయానికి తెరకెక్కించలేకపోయిన అనిల్ రావిపూడి, ఇప్పుడు కేవలం ఈ సీక్వెల్ చిత్రంపైనే ఫోకస్ పెట్టాడు.ఎఫ్3 అనే టైటిల్‌తో తెరకెక్కబోయే ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్‌లు మరోసారి తమదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.కాగా ఈ సీక్వెల్ చిత్రంలో మరో హీరో ఉండబోతున్నట్లు, అతడి పాత్రకోసం స్టార్ హీరోను కూడా ఎంపిక చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు గతకొద్ది రోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపించాయి.

అయితే ఈ సినిమాలో మూడో హీరో పాత్ర లేదని విక్టరీ వెంకటేష్ తేల్చి చెప్పాడు.
తాజాగా ఎఫ్3 చిత్రం గురించి కొన్ని అప్‌డేట్లను వెంకీ తన అభిమానులతో పంచుకున్నాడు.

ఈ క్రమంలో ఎఫ్3లో తన పాత్ర మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని ఆయన తెలిపాడు.అయితే ఈ సినిమాలో కేవలం ఇద్దరు హీరోలు మాత్రమే ఉంటారని, మూడో హీరో ఎవరూ లేడని ఆయన తేల్చి చెప్పాడు.

దీంతో ఎఫ్3లో మూడో హీరోకు సంబంధించిన అసలు విషయాన్ని వెంకీ తెలియజేయడంతో ఇప్పుడు ఈ సినిమాలో ఇద్దరే హీరోలు ఉండబోతున్నట్లు తేలిపోయింది.మరి ఈ సినిమాను ఎప్పుడు మొదలుపెడతారా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube