పసిడి ప్రియులకు శుభవార్త.. రూపాయికే బంగారం!

యువతులు, మహిళలు బంగారాన్ని ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.బంగారం ధర ఎంత పెరిగినా మహిళలకు పసిడిపై ఉండే ఇష్టం వల్ల బంగారం దుకాణాలు ఎల్లప్పుడూ కళకళలాడుతూ ఉంటాయి.

 Bharat Pe Upi Goodn News For Gold Lovers Bharath Pe, Gold Rate, 24 Cr Gold, Debi-TeluguStop.com

ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారం ధర 50,000 రూపాయలు పలుకుతోంది.అయితే అంత ఖర్చు చేసి బంగారాన్ని కొనలేని వాళ్లు ఒక్క రూపాయి చెల్లించి సులువుగా బంగారం కొనుగోలు చేయవచ్చు.

మర్చెంట్ పేమెంట్ ప్లాట్ ఫామ్ భారత్ పే పసిడి ప్రేమికులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది.సేఫ్ గోల్డ్ తో భాగస్వామ్యం చేసుకున్న భారత్ పే డిజిటల్ గోల్డ్ సర్వీసులను వినియోగదారుల కోసం అందుబాటులోకి తెచ్చింది.

భారత్ పే మర్చంట్లు తమ దగ్గర ఎంత ఉంటే అంత మొత్తాన్ని చెల్లించి డిజిటల్ గోల్ద్ ను కొనుగోలు చేయవచ్చు. 24 క్యారెట్ల గోల్డ్ ను యాప్ ద్వారా కొనుగోలు చేసే అవకాశాన్ని భారత్ పే కల్పిస్తోంది.

డిజిటల్ గోల్డ్ పై ఇన్వెస్ట్ చేసిన వాళ్లు ఇన్వెస్ట్ చేసిన నగదుతో భౌతికంగా బంగారాన్ని పొందే అవకాశాన్ని సైతం భారత్ పే కల్పిస్తూ ఉండటం గమనార్హం.బంగారాన్ని కొనుగోలు చేయాలనుకునే వాళ్లు ప్రస్తుతం భారత్ పే బ్యాలన్స్ లేదా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి ఇతర యూపీఐల ద్వారా చెల్లింపులు జరిపి డిజిటల్ గోల్డ్ ను కొనుగోలు చేయవచ్చు.

భవిష్యత్తులో చెల్లింపుల కోసం డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లను కుడా భారత్ పే అనుమతించనుందని సమాచారం.

డిజిటల్ గోల్డ్ ను కొనుగోలు చేసిన వాళ్ల కోసం భారత్ పే మర్చంట్లకు ప్రత్యేకమైన సదుపాయాలను కల్పిస్తూ ఉండటం గమనార్హం.

డిజిటల్ గోల్డ్ కొనుగోలుపై జీఎస్టీ ఇన్ పుట్ ను క్రెడిట్ చేసుకోవడంతో పాటు రియల్ టైమ్ లో గ్లోబల్ మార్కెట్ల ధరలను కూడా తెలుసుకోవచ్చు.ఫిజికల్ గోల్డ్ కావాలనుకునే వాళ్లకు డోర్ డెలివరీ సదుపాయం కూడా ఉంది.

బంగారం ఇష్టపడే వాళ్లకు భారత్ పే తెచ్చిన ఆఫర్ల వల్ల భారీగా ప్రయోజనాలు చేకూరనున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube