మహేష్‌ సినిమా కోసం రేణు దేశాయ్‌ ను సంప్రదించారా?

పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య అయిన రేణు దేశాయ్‌ సినిమాల్లో రీ ఎంట్రీకి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెల్సిందే.ఈమె దర్శకురాలిగా ఇప్పటికే మారింది.

 Renu Desai In Mahesh Babu Sarkaru Vaari Paata Movie, Renu Desai, Sister Role, Sa-TeluguStop.com

తెలుగులో ఈమె వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉంది.మరో వైపు ఈమె నటిగా కూడా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

కొన్నాళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో రేణు దేశాయ్‌ మాట్లాడుతూ ప్రభాస్‌.మహేష్‌ వంటి స్టార్‌ హీరోలకు అమ్మగా అక్కగా నటించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ చెప్పుకొచ్చింది.

దాంతో వారి సినిమాల్లో ఈమెకు ఏమైనా స్థానం ఉంటుందా అంటూ వెయిట్‌ చేశారు.తాజాగా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మహేష్‌ బాబు నటించబోతున్న సర్కారు వారి పాట సినిమాలో రేణు దేశాయ్‌ కనపించబోతుందట.

సర్కారు వారి పాట సినిమాలో హీరో పాత్రకు అక్క పాత్ర కీలకంగా ఉంటుందట.ఆ పాత్రకు గాను రేణు దేశాయ్‌ అయితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తుంది.

ఆమె ఓకే అంటే ఆ పాత్రను మరింత పదును పెట్టి ఆ పాత్ర నిడివి పెంచేందుకు సైతం చిత్ర యూనిట్‌ సభ్యులు సిద్దంగా ఉన్నారట.మహేష్ బాబుకు అక్క పాత్ర అంటే ఖచ్చితంగా ఈ అమ్మడు ఓకే చెప్పే అవకాశం ఉంది.

కాని మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ ఎలా రియాక్ట్‌ అవుతారు అనేది చూడాలి.పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య అవ్వడం వల్ల రేణు దేశాయ్‌కి బాగానే క్రేజ్‌ ఉంది.

అయితే ఆ క్రేజ్‌ పవన్‌ ఫ్యాన్స్‌ ఉపయోగించుకుని సర్కారు వారి పాటకు బ్యాడ్‌ చేయరు కదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.కొందరు రేణు దేశాయ్‌ ను నెట్టింట ఏ స్థాయిలో ట్రోల్స్‌ చేస్తారో తెలిసిందే.

వారే సర్కారు వారి పాట సినిమాను ట్రోల్స్‌ చేసే అవకాశం ఉందా అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.అతి త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube