కరోనా ఎవరినీ వదలడం లేదు.సీఎంలు, మాజీ సీఎంలు, రాజకీయ నేతలు కరోనా బారిన పడుతున్నారు.
ఇప్పటికే పలువురి నేతలకు కరోనా సోకగా.అందులో చాలామంది కోలుకున్నరు.
ఈ క్రమంలో తాజాగా మరో నేత కరోనా బారిన పడ్డారు.తాజాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్‌కు కరోనా సోకింది.
దీంతో ఆయన కోలుకోని తిరిగి రావాలంటూ అభిమానులు, కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు.
తాను కరోనా బారిన పడ్డ విషయాన్ని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్వయంగా తన ట్విట్టర్‌లో వెల్లడించారు.
ఇటీవల తనను కలిసినవారు వెంటనే కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.వైద్యుల సలహా మేరకు కరోనా చికిత్స పొందుతున్నట్లు దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించారు.లాక్‌డౌన్ నుంచి నిరంతరం పనిలో ఉన్నానని, ఇక ఇప్పుడు కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని ఆ దేవుడు కోరుకున్నట్టున్నాడు అని దేవేంద్ర ఫడ్నివిస్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ప్రస్తుతం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లు దేవేంద్ర ఫడ్నవిస్ స్పష్టం చేశారు.
అయితే ప్రస్తుతం బిహార్ ఎన్నికలు జరుగుతుండగా.ఈ ఎన్నికల కోసం బీహార్ ఎన్నికల ఇంచార్జ్‌గా దేవేంద్ర ఫడ్నవిస్‌ను బీజేపీ నియమించింది.
ఇటీవల బీహార్ ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన పాల్గొన్నారు.కాగా ఇప్పటికే హోంమంత్రి అమిత్‌షాతో పాటు పలువురు బీజేపీ నేతలు కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే.