సెన్సార్ పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీగా ఉన్న తేజ్ సోలో బ్రతుకు

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం సోలో బ్రతుకే సో బెటరు.ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.ఇందులో నభా నటేష్‌ తేజ్ కి జోడీగా నటిస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో సాయి తేజ్ పెళ్లంటే ఇష్టం లేని యువకుడు పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

 Solo Brathuke So Better Movie Gets Clean U Censor Certificate, Tollywood, Telugu-TeluguStop.com

అలాగే పెళ్లి కానీ యువకులు అందరిని మోటివేట్ చేసే విధంగా పాత్రని సుబ్బు డిజైన్ చేశాడు.ఈ సినిమా నుంచి ఇప్పటికే సాంగ్స్ ప్రేక్షకుల ముందుకి వచ్చి సందడి చేశాయి.

అలాగే బ్యాచిలర్స్ థీమ్ సాంగ్ కూడా ఎక్కువ మందికి రీచ్ అయ్యింది.ఇదిలా ఉంటే పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించాడు.

సినిమా చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు ఎటువంటి కట్స్ చెప్పకుండా క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

త్వరలోనే ఈ మూవీ గ్రాండ్ గా విడుదల కానుంది.కాగా టైటిల్ కి తగ్గట్టే పెళ్లి అంటే ఇష్టంలేని సోలోగా ఉండటమే బెటర్ అని అనుకునే యువకుడి కథ ఇది.ఇదిలా ఉంటే థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్ చేసిన తర్వాత సినిమాని రిలీజ్ చేయాలా, లేక 50 శాతం ఆక్యుపెన్సీతో రిలీజ్ చూసేద్దామా అనే ఆలోచనలో ప్రస్తుతం నిర్మాత ఉన్నాడు.మరో వైపు సినిమాకి ఓటీటీ సంస్థల నుంచి భారీ ఆఫర్స్ వస్తూ ఉండటంతో ఏదో ఒక డెసిషన్ తీసుకోవడానికి నిర్మాత ఫిక్స్ అయ్యారు.

ఏది ఏమైనా ఈ ఏడాదిలోనే సినిమాని రిలీజ్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube