చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా నాశనం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అగ్రరాజ్యం సైతం గడగడవణికిపోయింది ఈ కరోనా దెబ్బకు.ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్లమందికి కరోనా వైరస్ వ్యాపించగా అదృష్టం కొద్దీ అందులో మూడు కోట్లమంది కరోనా నుంచి కోలుకున్నారు.11 లక్షలమంది కరోనా వైరస్ కు బలయ్యారు.ఇక ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ కు వ్యాక్సిన్ వచ్చిన రాకున్నా కరోనాకు భయపడకుండా ఎంజాయ్ చేస్తున్నారు ప్రజలు.
అయితే కరోనా వైరస్ సమయంలో ఎంతోమంది డాక్టర్లు కరోనా వారియర్స్ గా సేవలు చేస్తే.
మరెంతోమంది డాక్టర్ ముసుగులో ఉండే వ్యాపారాలు చేశారు.తుమ్ము వచ్చిన, జలుబు వచ్చిన బాడీ అంత టెస్టులు చేస్తూ లక్షలు లక్షలు గుంజారు.
ఎంతోమంది ప్రైవేట్ ఆస్పత్రిలో బిల్ కట్టలేక బయటకు రాలేక అవస్థలు పడ్డారు.ఇక ఇలా ప్రైవేట్ ఆస్పత్రులకు బిల్ కట్టలేక ప్రజలు కన్నీరుమున్నీరవుతే ఈకాలం పిల్లలు కూడా వ్యాపారులుగా మారిపోయారు.
డాలర్స్ కోసం ప్రాణాలనే పణంగా పెడుతున్నారు.వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది అక్షరాలా నిజం.ఎంతోమంది యూనివర్సిటీ విద్యార్థులు కావాలనే కరోనా వైరస్ ని తెచ్చుకుంటున్నారట.కరోనా వైరస్ వచ్చి వెళ్లిన తర్వాత ఏర్పడే ప్లాస్మాలను విద్యార్థులు ఆస్పత్రుల్లో అమ్ముకుంటున్నారు.
ఒకసారి ఇస్తే ఏకంగా 100 నుంచి 200 డాలర్లు రావడంతో ఈ పని చేస్తున్నారు.అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 7 వేల రూపాయిల నుంచి 14 వేల రూపాయిల వరకు వస్తుందట.
అందుకనే యూనివర్సిటీ విద్యార్థులు అంత కూడా ఆ డబ్బుకు ఆశ పడి కావాలని కరోనా వైరస్ తెచ్చుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు.ఈ విషయంపై మాట్లాడిన వైద్యులు.
విద్యార్థులు అలా చేయకూడదని.రోగనిరోధకశక్తి ఎంత ఉందొ తెలుసుకోకుండా చేస్తే ప్రమాదంలో పడుతారని చెప్తున్నారు.