మురళీధరన్ బయోపిక్ నుంచి తప్పుకున్న విజయ్ సేతుపతి

కోలీవుడ్ లో గత కొద్ది రోజులుగా శ్రీలంక క్రికెటర్ మురళీధరన్ బయోపిక్ రచ్చ నడుస్తుంది.విజయ్ సేతుపతి ఇందులో టైటిల్ రోల్ పోషిస్తూ ఉండగా శ్రీపతి దర్శకత్వంలో తెరకెక్కడానికి రెడీ అయ్యింది.

 Vijay Sethupathi Quit From Muralitharan Biopic, Kollywood, Tollywood, Srilanka C-TeluguStop.com

ఈ బయోపిక్ ని తెరకెక్కిస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించి పోస్టర్ విడుదల చేయడంతోనే తమిళ సంఘాలు దీనికి వ్యతిరేకంగా ఆందోళన మొదలు పెట్టాయి.మురళీధరన్ తమిళ ద్రోహి అని అలాంటి వ్యక్తి బయోపిక్ ని తమిళంలో తెరకెక్కించే ప్రయత్నం మానుకోవాలని హెచ్చరించారు.

అలాగే విజయ్ సేతుపతి తక్షణం ఈ సినిమా నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించడంతో పాటు సోషల్ మీడియాలో ఈ బయోపిక్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కాంపైన్ నిర్వహించారు.

సీనియర్ దర్శకుడు భారతీ రాజా లాంటి వారు కూడా మురళీధరన్ బయోపిక్ విషయంలో ఘాటు వాఖ్యలు చేశారు.ఈ నేపధ్యంలో తప్పనిసరి పరిస్థితిలో హీరో విజయ్ సేతుపతి కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి విజయ్‌ సేతుపతి తప్పుకున్నారు.ఈ విషయాన్ని మురళీధరన్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు.తన బయోపిక్ పై జరుగుతున్న నెగిటివ్ ప్రచారంతో ఆవేదన చెందిన మురళీధరన్ ఈ సినిమా నుంచి తప్పుకోవాలని విజయ్ సేతుపతికి సలహా ఇచ్చాడు.నా వల్ల నీలాంటి గొప్ప నటుడు ఇబ్బంది పడటం కరెక్ట్‌ కాదు.

ఎటువంటివంటి ఇబ్బందులు పడొద్దు అని మురళీధరన్ ఓ లేఖలో పేర్కొన్నారు.ఆ లేఖకు ధన్యవాదాలు అని విజయ్ సేతుపతి సమాధానమిచ్చారు.

దీంతో మురళీధరన్ బయోపిక్ నుంచి విజయ్ తప్పుకోవడం ఖరారు అయిపొయింది.అయితే ఇప్పుడు ఈ బయోపిక్ ఆగిపోతుందా లేదంటే వేరొక హీరోతో సినిమాని తెరకెక్కిస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube