మోహన్ లాల్ త్రీడీ ఫాంటసీ దర్శకత్వం... 13 ఏళ్ల పిల్లాడు సంగీతం

మలయాళీ స్టార్ హీరో మోహన్ లాల్ నటుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు.ఎప్పటికప్పుడు తనని తాను మార్చుకుంటూ వయస్సుకి తగ్గ పాత్రలు, సినిమాలు ఎంపిక చేసుకుంటూ దూసుకుపోతున్నాడు.

 Mohanlal Turns Director With Barroz, Malayalam Super Star, South Cinema, Tollywo-TeluguStop.com

మలయాళంలోనే కాకుండా అన్నిఇండస్ట్రీలో మోహన్ లాల్ కి మంచి గుర్తింపు ఉంది.అయితే మోహన్ లాల్ లో కేవలం నటుడు మాత్రమే కాకుండా దర్శకుడు కూడా ఉన్నాడని నిరూపించుకోవడానికి రెడీ అవుతున్నారు.

ఆయన స్వీయ దర్శకత్వంలో ఒక త్రీడీ మూవీ తెరకెక్కనుంది.ఎప్పుడో ఈ సినిమా స్టార్ట్ చేయాలని అనుకున్నా కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది.ఎట్టకేలకి ఈ సినిమా పట్టాలు ఎక్కబోతుంది.పిల్లల కోసమే ప్రత్యేకంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.బార్రోజ్ అనే టైటిల్ తో మోహన్ లాల్ ఈ సినిమాను ఆవిష్కరించబోతున్నారు.

తాజాగా ఈ సినిమాకి సంబందించిన టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేసి సినిమా విశేషాలు పంచుకున్నారు.

పూర్తిగా 3డి టెక్నాలజీతో రూపొందబోతున్న ఈ సినిమాలో మోహన్ లాల్ నే టైటిల్ రోల్ పోషించబోతున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాకి మరో ప్రత్యేకత కూడా ఉంది.

కేవలం 13 ఏళ్ల లిడియన్ అనే కుర్రాడు ఈ సినిమాకి సంగీతాన్ని అందించబోతున్నాడు.హాలీవుడ్ స్టార్స్, టెక్నీషియన్స్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు.

సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.ఈ సినిమా టైటిల్ లోగోలో మోహన్ లాల్ గెటప్ చాలా విభిన్నంగా ఉండటంతో అప్పుడే అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.

ఈ సినిమాని మలయాళంలో తెరకెక్కించి ఇండియన్ బాషలలో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది.మరి పూర్తిస్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో మోహన్ లాల్ నటుడుగా, దర్శకుడుగా, నిర్మాతగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా ఎంత వరకు ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుంది అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube