ఆర్ట్ అన్నాడు.. అరెస్ట్ చేశారు.. కారణం ఏమిటంటే?

ఆర్ట్ అనేది కొంతమందికి మాత్రమే వచ్చే ఒక అద్భుతమైన కళ.ఆ కళతో వారు ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంటారు.

 Teenager Performs Dangerous Stunt On 22nd Floor , Performing Stunts, 22nd Floor-TeluguStop.com

ఈ తరహాలోనే ఒక ఆర్టిస్ట్ తనకు వచ్చిన కళతో అద్భుతమైన విన్యాసాలు చేస్తుండడంతో, అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.ఈ ఘటన ముంబై ప్రాంతంలో చోటు చేసుకుంది.

ఈ విషయం తెలుసుకున్న పలువురు ఆర్టిస్ట్ లను కూడా అరెస్ట్ చేస్తారా? అంటూ నిట్టూర్చారు.అయితే ఆ యువకుడిని పోలీసులు ఎందుకు అరెస్టు చేశారో పూర్తి వివరాలను తెలుసుకుందాం.

ముంబైలోని 22 సంవత్సరాల యువకుడు అతనికి వచ్చిన అద్భుతమైన విన్యాసాలు భవనం 22 వ అంతస్తులో స్టంట్ చేస్తున్న ఒక వీడియో పోలీసుల దృష్టిలో పడటంతో ఆ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.ఆ యువకుడు 22 అంతస్తులో ఎనర్జీ డ్రింక్స్ తాగుతూ అద్భుతమైన విన్యాసాలను చేస్తూ ఉండగా, అతని స్నేహితులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అయితే ఆ వీడియో కాస్త పోలీసుల కంట పడటంతో ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.అతను స్టంట్ చేస్తూ పక్కనున్న లెడ్జ్‌పైకి దూకాడు.అయితే ఆ లెడ్జ్ కేవలం రెండు అడుగుల వెడల్పు మాత్రమే ఉంది.ఇలాంటి అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలలో ఇలాంటి సన్నివేశాలు చేయడం ద్వారా వాటిని చూసి మరొకరు ప్రయత్నిస్తే, వారి ప్రాణాలకే ప్రమాదమని భావించి పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు.
అరెస్టు చేసిన యువకుడికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి మనలో ఉన్న ప్రతిభను బయటకు తెలియజేయడం ద్వారా నలుగురికి ఉపయోగపడే లా ఉండాలి కానీ, ఇలా ప్రాణాలకు ప్రమాదకరంగా ఉండే విన్యాసాలను చేయకూడదని తెలిపారు.అయితే సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు, ఎంతో ధైర్యంతో సాహసించాడని ప్రశంసించగా, మరికొందరు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని సదరు నెటిజన్లు కామెంట్ చేశారు.

ఏదైతేనేం ఇలాంటి విన్యాసాలను చేసేటప్పుడు నిపుణుల పర్యవేక్షణలో చేయడం ద్వారా ప్రాణ నష్టం ఉండదని వారు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube