ఆ దేశంలో Q , W , X లపై నిషేధం .. ఎందుకంటే ?

ఇంగ్లీష్ .ఈ ప్రపంచంలో ఎక్కువమంది మాట్లాడే భాషల్లో ఒకటి.

 ఆ దేశంలో Q , W , X లపై నిషేధం .. ఎందు-TeluguStop.com

ఇంగ్లీష్ వస్తే దాదాపుగా ప్రపంచం మొత్తం చుట్టేయచ్చు.ఇకకొన్ని కొన్ని దేశాల్లో భాష వేరైనా లిపిని దాదాపుగా లాటిన్‌ ఇంగ్లీష్ ‌లోనే రాస్తుంటారు.

అయితే , కొన్నేళ్ల కిందట Q, W, X అక్షరాలను అక్కడి భాషలో వాడటం టర్కీ ప్రభుత్వం నిషేధించింది.అక్కడి ప్రజల పేర్లలో ఈ అక్షరాలు ఉన్నా, వారు ఈ అక్షరాలని పలికినా జరిమానా, శిక్షలు విధించేవారు.

అయితే , ఈ నిషేధం కొన్నేళ్ల పాటు కొనసాగిన తర్వాత 2013లో ఎత్తివేశారు.

అయితే ఎ , బి , సి డి లు 26 ఉంటే , ఈ Q , W , X అసలు ఎందుకు ఈ నిషేధం విధించారంటే .దాని వెనుక ఓ పెద్ద కథ ఉంది.టర్కీలో 75 శాతానికిపైగా టర్కీవాసులు, 20శాతం మంది కుర్దులు ఉన్నారు.

దీంతో టర్కీ అధికారిక భాష టర్కీష్ ‌తోపాటు కుర్దిష్‌ భాష వాడుకలో ఉంది.రెండు భాషల లిపి ఇంగ్లిష్‌ లో రాస్తే దాదాపు ఒకేలా ఉంటాయి.

అయితే, ఈ కుర్దులపై ఒకప్పుడు టర్కీ ప్రభుత్వం బాగా వివక్ష చూపించేదట.ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు కుర్దిష్‌ భాషను దెబ్బతీయాలని టర్కీ ప్రభుత్వం ప్రయ్నతించేది.

టర్కీలో కుర్దిష్‌ మాట్లాడటం నేరంగా ప్రకటించింది.దీంతో కుర్దులు కూడా అధికారిక భాష టర్కీష్‌ లోనే మాట్లాడాల్సి వచ్చేది.అంతేకాదు, కుర్దిష్‌ ను అణచివేయాలని టర్కీ సర్కార్‌ అధికారిక భాష టర్కీష్‌ లిపిని మార్చింది.కుర్దిష్‌ లో ఎక్కువగా కనిపించే Q, W, X అక్షరాలను టర్కీష్‌ నుంచి తొలగించింది.

ఎవరైనా సరే తమ పేర్లలో, లేఖల్లో, ప్రచారంలో ఈ మూడు అక్షరాలను ఉపయోగిస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేసింది.దీంతో అక్కడి ప్రజల గుర్తింపు కార్డుల్లో, ఇతర పత్రాల్లో పేర్లలోని ఆ మూడు అక్షరాలను తీసేసుకున్నారు.

అందుకే టర్కీలో టాక్సీలకు taxi అని కాకుండా taksi అని రాసి ఉంటుంది.అయితే, కాలంతోపాటు టర్కీ ప్రభుత్వంలోనూ మార్పులు వచ్చాయి.2013లో Q, W, X అక్షరాలపై నిషేధాన్ని ఎత్తివేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube