వైజాగ్‌లో ఎగిరే జెండా ఏ పార్టీది అంటే .. లేటెస్ట్ స‌ర్వే ఇదే..!

విశాఖ‌ప‌ట్నం ఏపీ లెజిస్లేటివ్ కేపిట‌ల్ కావ‌డంతో ఇప్పుడు అక్క‌డ జ‌రిగే కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ఫ‌లితం ఎలా ఉంటుందా ? అన్న ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది.గ‌త అసెంబ్లీ ఎన్నికల్లో న‌గ‌రంలోని నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీ జెండాయే ఎగిరింది.

 Do You Know  Which Party Flag Will Flys In Vizag, Visakhapatanam, Andhra Pradesh-TeluguStop.com

వీరిలో దక్షిణం ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్ పార్టీ మారిపోయారు.మిగిలిన వారిలో నార్త్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు సైతం పార్టీతో అంటీ ముట్ట‌న‌ట్టుగా ఉంటున్నారు.

ఇక ప‌శ్చిమ ఎమ్మెల్యే గ‌ణ‌బాబు సైతం త్వ‌ర‌లోనే పార్టీ కండువా మార్చేస్తారంటున్నారు.

ఇక ఈ లెక్క‌న టీడీపీకి ఒక్క తూర్పు ఎమ్మెల్యే వెల‌గ‌పూడి రామ‌కృష్ణ బాబు మాత్ర‌మే ఉంటారు.

ఇక వైజాగ్ కార్పొరేష‌న్‌పై వైసీపీ జెండా ఎగ‌ర‌వేసేందుకు ఆ పార్టీ గ‌త ఆరేడు నెల‌ల‌గా స్పెష‌ల్ వ‌ర్క్ చేస్తోంది.ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి వైజాగ్‌పై గ‌ట్టిగా దృష్టి పెట్టారు.

ఇక ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఎన్నిక‌లు జ‌రిగినా వైసీపీకి 98 డిజ‌విన్లో 80కు పైగా డివిజ‌న్లు రావొచ్చ‌ని తాజాగా జ‌రిగిన రెండు స‌ర్వేల్లో తేలింద‌ట‌.వైజాగ్ ఓట‌రు తీర్పు ఎలా ఉందో తెలుసుకునేందుకు వీడీపాఏ అసోసియేట్స్ అనే సంస్ధ ఓటరునాడిపై సర్వే చేసింది.

Telugu Andhra Pradesh, Gave, Flag, Visakhapatanam-Telugu Political News

ఈ స‌ర్వేలో వైసీపీకి 80 డివిజ‌న్ల‌కు పైగానే రావొచ్చ‌ని అంటున్నారు.వైసీపీకి ఓటేస్తామ‌ని చెప్పిన వారి సంఖ్య 49 శాతంగా ఉంది.టీడీపీకి 36 శాతం మంది ఓటేస్తామ‌ని చెప్ప‌గా… జ‌న‌సేన‌కు 4.1, బీజేపీకి 2.8 శాతం మంది మొగ్గు చూపారు.ఇక కాంగ్రెస్‌కు 1.7 శాతం మొగ్గారు.టీడీపీకి 15 డిజ‌విన్లు వ‌స్తాయ‌ని.

అందులో కూడా తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలోనే ఎక్కువుగా వ‌స్తాయ‌ని తేలింద‌ట‌.ఏదేమైనా రాజ‌ధాని ప్ర‌క‌ట‌న‌తో వైజాగ్ ఓట‌రు వైసీపీకి ప‌ట్టం క‌ట్ట‌నున్నార‌న్న‌ది స్ప‌ష్టంగా తేలిపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube