ఇప్పుడు అన్ని ఓటీటీ సినిమాలే.. అయితే బోల్డ్ లేదంటే హార్డ్

కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ తో థియేటర్లు మూత పడటంతో డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కి క్రేజ్ పెరిగింది.అలాగే టీవీ ఎంటర్టైన్మెంట్ కి కూడా డిమాండ్ బాగానే పెరిగింది.

 Bold And Crime Stories Carafe Ott Channels, Tollywood, Bollywood, Ott Movies, We-TeluguStop.com

డిజిటల్ ఎంటర్టైన్మెంట్ రంగంలోకి చాలా సంస్థలు ఎంట్రీ ఇచ్చాయి.అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ హాట్ స్టార్, జీ5, ఆహా లాంటి ఓటీటీ యాప్స్ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో హవా సృష్టిస్తున్నాయి.

మరికొన్ని వ్యాపార సంస్థలు ఈ రంగంలోకి అడుగుపెడుతున్నాయి.ఈ డిజిటల్ చానల్స్ ద్వారా వెబ్ సిరీస్ లని అందిస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాయి.

డిజిటల్ మీడియాలోకి వచ్చేసరికి లిమిటేషన్స్ లేకపోవడం కంటెంట్ లో కూడా చాలా మార్పులు వస్తున్నాయి.సెలబ్రెటీలు తన కెరియర్ పెంచుకోవడం కోసం కొత్త కథలలో నటించడం కోసం వెబ్ సిరీస్ ల వైపు వస్తున్నారు.

అదే సమయంలో బోల్డ్, ఎరోటిక్ కథలని తెరపై ఆవిష్కరించేందుకు దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.

డిజిటల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ప్రేక్షకులని ఫామిలీ కథలు కంటే రొమాంటిక్, క్రైమ్, కామెడీ కథలు ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి.

ఈ నేపధ్యంలో దర్శకులు కూడా అలాంటి కథలనే చెప్పేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.ఓ వైపు వెబ్ సిరీస్ లతో పాటు వెబ్ సినిమాలు కూడా తెరకెక్కిస్తున్నారు.సిల్వర్ స్క్రీన్ పై ఒక కథని చెప్పాలంటే అన్ని వర్గాల ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకోవాలి.అలాగే సెన్సార్ పరిమితులు ఉంటాయి.

అదే సమయంలో ప్రజల మనోభావాలు కూడా పరిగణంలోకి తీసుకోవాలి.ఈ హద్దులు దాటుకొని సినిమా చేయాలంటే కథలు రాసే సమయంలోనే బౌండరీలు పెట్టుకోవాలి.

అయితే వెబ్ సినిమాలకి వచ్చేసరికి అలాంటి హద్దులు అవసరం లేదు.ఒక వర్గం ఆడియన్స్ కి కనెక్ట్ అయితే చాలు.

ఈ నేపధ్యంలో చాలా మంది దర్శకులు ఇప్పటికే ఓటీటీ ఛానల్స్ కోసం వెబ్ సినిమాలు స్టార్ట్ చేస్తున్నారు.ముందుగానే చానల్స్ లో మాట్లాడుకొని బోల్డ్, క్రైం రిలేటెడ్ కథలకి ప్రాణం పోస్తున్నారు.

తెలుగులోనే ప్రస్తుతం ఓ పది వరకు ఓటీటీ సినిమాలు తెరకెక్కుతున్నాయి అంటే వాటికి డిమాండ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube