నల్ల పిల్లగా మారబోతున్న ఇల్లీ బేబీ... క్యారెక్టర్ కొత్తగా

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకొని అదే ఇమేజ్ ఉన్న సమయంలోనే ఒక్కసారిగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు సినిమాలు పూర్తిగా పక్కన పెట్టేసిన నటి ఇలియానా.బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోవాలని కలలతో అక్కడికి వెళ్లిన ఇల్లీ బేబీకి ఆ అవకాశం ఇప్పటికి రాలేదు.

 Ileana Ready To Act Unfair And Lovely, Bollywood, Tollywood, Bollywood Celebriti-TeluguStop.com

అడపాదడపా సినిమాలు చేస్తున్న, తన అందాలతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్న బాలీవుడ్ లో ఇల్లీ బేబీని పట్టించుకుంటున్న దర్శకులు పెద్దగా లేరు.అయితే అప్పుడప్పుడు ఏదో ఒక దర్శకుడు ఇలియానాకి అవకాశం ఇస్తూ ఉంటాడు.

ఇలియానా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయితే కాలేకపోయింది కానీ అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలతో ఆడిపాడింది.ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ లో హర్షద్ మెహతా జీవితం ఆధారంగా తెరకెక్కిన ది బిగ్ బుల్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుంది.

అలాగే ముబారకన్ అనే సినిమా ఒకటి చేస్తుంది.

ఇలియానా తన కెరియర్ ని బాలీవుడ్ లో ఒక చెవుడు, మూగ అమ్మాయి పాత్రతో మొదలు పెట్టింది.

చాలా కాలం తర్వాత మరోసారి అలాంటి భిన్నమైన పాత్రలో నటించే అవకాశం సొంతం చేసుకుంది.అమ్మాయిలు శారీరక ఛాయకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.ముఖ్యంగా మొహం తెల్లగా మెరిసిపోవాలని అనుకుంటారు.దానికోసం బ్యూటీ ప్రోడక్ట్స్ ని ఎక్కువగా ఆశ్రయిస్తారు.

అమ్మాయిల మొహం ఛాయాని పెంచుతాయి అంటూ చాలా బ్యూటీ ప్రోడక్ట్స్ మార్కెట్ లోకి వస్తూ ఉంటాయి.ఇదే సమయంలో నల్లగా ఉన్న అమ్మాయిల మీద బాడీ షేమింగ్ కామెంట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి.

నల్లగా ఉండటం అనేది ఏదో నేరం క్రింద సమాజంలో కించపరుస్తూ ఉంటారు.అయితే ఇప్పుడు బ్యూటీ ప్రోడక్ట్స్ నేపధ్యంలో బల్వీందర్‌సింగ్‌ దర్శకత్వంలో అన్‌ఫెయిర్‌ అండ్‌ లవ్లీ అనే సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో నల్లగా ఉన్న అమ్మాయిగా పాత్రలో ఇలియానా కనిపించబోతుంది.తన మొహం రంగుని మార్చుకోవడానికి పరితపించే ఈ కాలం అమ్మాయిగా ఆమె పాత్ర ఉండబోతుంది అని టాక్.

కామెడీ సెటైరికల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని దర్శకుడు ఆవిష్కరిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube