గంగవ్వ కోసం ఇంటి పనులు మొదలయ్యాయి.. బిబి4 ఫైనల్‌ ఎపిసోడ్‌ రోజు కీలక ప్రకటన

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో ప్రత్యేక కంటెస్టెంట్ గా నిలిచిన గంగవ్వ ఐదు వారాల పాటు కొనసాగి మొన్న శనివారం ఎపిసోడ్‌ లో బయటకు వచ్చిన విషయం తెల్సిందే.ఆమె కోరుకోవడం మరియు ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల ఆమెను బిగ్‌ బాస్‌ టీం బయటకు పంపిస్తున్నట్లుగా ప్రకటించారు.

 Bigg Boss Team Started Gangavva House Work  Nagarjuna, Big Boss 4, Gangavva, Sta-TeluguStop.com

బిగ్ బాస్ ఇంటిని వదిలి వెళ్లిపోయిన గంగవ్వ త్వరలోనే తన ఇంట్లో అడుగు పెట్టబోతోంది.గంగవ్వ ఏ కారణంతో బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా వెళ్ళిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే.

తనకు ఒక ఇల్లు నిర్మించుకోవాలని ఉందని ఆ ఇంటి కోసమే డబ్బులు సంపాదించుకోవడానికి ఇక్కడికి వచ్చాను అంటూ చెప్పుకొచ్చింది.గంగవ్వ కు బిగ్ బాస్ నిర్వాహకులు ఇల్లు కట్టించేందుకు సిద్ధమవుతున్నారు.

ఆమెను పంపించే సమయంలో నాగార్జున స్వయంగా ఇల్లు కట్టి ఇస్తానంటూ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.ప్రేక్షకులు మరియు నెటిజెన్స్ నిజంగానే బిగ్ బాస్ టీం గంగవ్వ కు ఇల్లు కట్టించి చేస్తారా అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు.

ఆమెకి ఇవ్వాల్సిన పారితోషికం చేతిలో పెట్టి ఇంత వరకే తమ బాధ్యత అంటూ వదిలేస్తారేమో అని అంతా అనుకున్నారు.కానీ గంగవ్వ ను అలా వదిలేయకుండా ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ వరకు గంగవ్వ ఇల్లు ప్రారంభించేందుకు గాను బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట.

5 వారాల పాటు బిగ్ బాస్ కి చాలా ప్రత్యేకం గా నిలిచిన ప్రత్యేకంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నాగార్జునతో పాటు బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారు.అందుకోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.

ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ వరకు ఇల్లు ను ప్రారంభిస్తున్నట్లు గా ప్రకటించి వచ్చే సీజన్ వరకు ఇల్లు పూర్తి చేసి ప్రారంభ ఎపిసోడ్లో ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.మొత్తానికి గంగవ్వ కు ఇచ్చిన హామీని బిగ్ బాస్ నిర్వాహకులు నెరవేర్చ బోతున్నారు.

ఈ విషయంలో వారిని అభినందించాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube