వీరబాదుడు బాదిన డివిలియర్స్ ..112 కే చాప చుట్టేసిన కేకేఆర్ !

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్ లో బెంగళూరు జట్టు మొదట కొంచెం డల్ గా కనిపించినా , ఇప్పుడు గేరు మార్చింది.వరుస విజయాలతో హాట్ ఫెవరెట్ గా ముందుకు సాగుతుంది.నేడు షార్జా క్రికెట్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ‌తో జరిగిన మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది.82 పరుగుల భారీ తేడాతో కోల్‌కతాను చిత్తు చిత్తుగా ఓడించింది.ఏబీ డివిలియర్స్ 6 సిక్సులు, 5 ఫోర్లతో కేవలం 33 బంతుల్లో 73 పరుగులతో స్టేడియంలో పరుగుల వర్షం కురిపించాడు.

 Kkr, Rcb, Kohli,dinesh, De Villiers, Ipl , Ipl2020-TeluguStop.com

195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ బాట్స్‌ మెన్స్ ఆర్సీబీ బౌలర్ల దాటికి వరుసగా పెవిలియన్‌ కు చేరారు.ఓపెనర్ శుభమన్ గిల్(34) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు.సునీల్ నరైన్ స్థానంలో వచ్చిన ఇంగ్లండ్ సెన్సేషన్ టామ్ బాంటన్‌(8) స్వల్ఫ పరుగులకే ఔటై నిరాశ పరిచాడు.

అక్కడి నుంచి మెుదలైన కోల్‌కతా వికెట్ల పతనం.నితీష్ రాణా(9) , ఇయాన్ మోర్గాన్(8),దినేశ్ కార్తీక్ (1) ఆండ్రీ రస్సెల్(16)తో మిడిలార్డర్ మెుత్తం విఫలమైంది.

పేలవ బ్యాటింగ్‌తో తడబడి 112 పరుగులకే అల్ అవుట్ అయింది.

బెంగళూరు బౌలర్లలో క్రిస్ మోరిస్, వాషింగ్టన్ సుందర్‌లకు చెరో వికెట్ దక్కగా.

నవదీప్ సైనీ, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, ఇసురు ఉడానాలకు తలో వికెట్ దక్కింది.ఈ ఓటమితో కోల్‌కతా 7 మ్యాచుల్లో 4 విజయాలతో పాయింట్స్ టేబుల్‌ లో నాలుగో స్థానానికి పడిపోయింది.

మరో వైపు బెంగళూరు జట్టు వరుస విజయాలతో 7 మ్యాచుల్లో 5 విజయాలు సాధించి పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానానికి చేరింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube