అమ్మో.. పకోడి చేయలేదని ఆ నటి గడగడలాడించిందట!

తెలుగు సినీ పరిశ్రమలో గయ్యాళి ఎవరు అంటే కళ్ళుమూసుకొని చెప్పేస్తారు.”సూర్యకాంతం” అని.ఈ పేరు వినగానే అందరికీ గుర్తు వచ్చే మరో పేరు గయ్యాళి అత్త.ఈమెకు నటన, డాన్స్ ల పట్ల ఎక్కువ ఆసక్తి ఉండేది.

 Um Of Course Yes I Know This Why It S Something Known Advance  Suryakantham,sara-TeluguStop.com

దానితో మద్రాసుకు వెళ్లి సినిమా అవకాశాలు దక్కించుకుంది ఈ సూర్యకాంతం అత్త.ఈవిడ మొదట 1949 ధర్మాంగద చిత్రంలో చిన్న వేషాలు వేసి తర్వాత సహాయ నటిగా ఎన్నో సినిమాలలో అవకాశం దక్కించుకొని అద్భుతంగా నటించిందని.

దాదాపు అరవై నాలుగు సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్న ఈ గయ్యాళి అత్తకు హిందీ భాషలో కూడా అవకాశాలు బాగానే వచ్చాయి.కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల తెలుగు పరిశ్రమకే పరిమితం అయ్యింది.

ఈవిడ ఎక్కువగా అత్త పాత్రల్లోనే గయ్యాళి అత్తగా నటించేది.ఆ పాత్రలే ఆమెకు గుర్తింపు తెచ్చింది.

అత్త పాత్రలో గయ్యాళిగా ఉన్న ఈవిడకు చివరికి గయ్యాళి అత్త అనే పేరు వచ్చింది.

గయ్యాలి అనేది ఆమె పేరుకు ఒక గుర్తింపు మాత్రమే.

తనని వ్యతిరేకంగా ఉద్దేశించి అన్న మాట కాదు.సూర్యకాంతం మనసు ఎంతో గొప్పది.

కానీ కొన్ని కొన్నిసార్లు కోపాన్ని అదుపు చేసుకోలేక సినిమా బయటకు వచ్చిన గయ్యాళిలా అరిచేది.ఇక అలానే ఒక షూటింగ్ సంబంధించి హైదరాబాదు లో సారథి స్టూడియోస్ కి వచ్చారు.

ఆ స్టూడియోలో ఉన్న క్యాంటీన్ లో సర్వర్ తో సాయింత్రం పకోడి చేసి ఉంచమన్నారు.

ఇక సాయంత్రం పకోడి తీసుకొని రమ్మని అక్కడ ఉన్న వాళ్లకు చెప్పగా… అక్కడికి ఆ సర్వర్ వచ్చి పకోడీ చేయలేదు అని చెప్పాడు.“నేను ముందు అడిగినప్పుడు ఎందుకు చేస్తానన్నావు… ఇప్పుడు చేయలేదని, ఎలా చెబుతున్నావు… చేయకపోతే నాకు తెలియజేసేది లేదా అని… అక్కడున్న క్యాంటీన్ యజమానిపై అరిచారు.ఎవరికీ చెప్పుకుంటావో చెప్పుకో నేనైతే డబ్బులు ఇవ్వను ఎక్కువగా మాట్లాడితే క్యాంటీన్ తీపించేస్తా.” అని సూర్యకాంతం చాలా గట్టిగా అరిచారట.ఈ విషయాన్నీ అక్కడ ఉన్న వారు విని ఆ నోటా ఈ నోటా పలికి ఇప్పటికి ఎక్కడోక చోటా వార్తల్లో వచ్చేలా చేశారు.

ఏది ఏమైనా గాసిప్ కి ఉన్న పవర్ అలాంటిది మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube