ఉత్కంఠ పోరులో కేకేఆర్ సూపర్ విక్టరీ

అబుదాబిలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ‌తో జరిగిన మ్యాచ్ ‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ సూపర్ విక్టరీ అందుకుంది.కేవలం 2 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది.

 Kxlp, Kkr, Ipl, Ipl 2020, Dinesh Kartik, Rahul-TeluguStop.com

మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌ కతా జట్టు.నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన 164 పరుగులు చేసింది.165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు, నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 రన్స్ మాత్రమే సాధించింది.ఓపెనర్ , కెప్టెన్ కేఎల్ రాహుల్ 74 పరుగులు, మయాంగ్ అగర్వాల్ 56 రన్స్ చేసి విజయ తీరాలకి అయితే చేర్చారు కానీ , విజయం కట్టబెట్టలేకపోయారు.

పంజాబ్‌కు ఓపెనర్లు అద్భుతమైన ఆరంభమిచ్చిన అదే దూకుడును కొనసాగించలేకపోయింది.

పంజాబ్ ఇన్నింగ్స్ లో 115 పరుగుల వద్ద మయాంగ్ అగర్వాల్ ఔటయ్యాడు.144 స్కోర్ వద్ద పూరన్ వెనుదిరిగాడు.ఆ తర్వాత వరుసగా సిమ్రాన్ సింగ్, కేఎల్ రాహుల్ అవుట్ అయ్యారు.

పంజాబ్ విజయానికి 14 పరుగులు దూరంలో అతడు ఔటయ్యాడు.ఇక చివరి ఓవర్లో మన్‌దీప్ సింగ్ కూడా ఔటవడంతో మ్యాచ్ ఉత్కంఠ స్థాయికి చేరింది.

ఆఖరి బంతిలో 7 పరుగులు కావాల్సి ఉండగా.మాక్స్‌ వెల్ భారీ సిక్సర్‌ కు ప్రయత్నించాడు.

కానీ, దారం అంత దూరంలో సిక్స్ మిస్ అయ్యి , ఫోర్ పోవడంతో 2 పరుగుల తేడాతో పంజాబ్ ఓడిపోయింది.ఆ బాల్ సిక్స్ వెళ్లి ఉంటే మ్యాచ్ టై అయ్యి.

సూపర్ ఓవర్‌కి దారితీసేది.

కోల్‌కతా బౌలర్లలో ప్రసిద్ధ్ క్రిష్ణ 3 వికెట్లు పడగొట్టాడు.

ఇవాళే శివం మావి స్థానంలో జట్టులోకి వచ్చిన ప్రసిద్ధ్ అద్భుతమైన బౌలింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.సునీల్ నరైన్‌కు రెండు వికెట్లు దక్కాయి.అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు 5 వికెట్లో కోల్పోయి.164 పరుగులు చేసింది.కెప్టెన్ దినేష్ కార్తీక్ 58, ఓపెనర్ శుభమాన్ గిల్ 57 పరుగులతో రాణించారు.ఐపీఎల్ 2020 సీజన్‌లో పంజాబ్‌కు ఇది వరుసగా ఐదో ఓటమి.ఇప్పటి వరకు 7 మ్యాచ్‌ లు ఆడిన కేఎల్ రాహుల్ సేన.కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది.కేవలం బెంగళూరు జట్టుపై మాత్రమే విజయం సాధించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube