వామ్మో.. బిగ్ బాస్ 'అవినాష్'కి వారానికి అంత పారితోషికం ఇస్తున్నాడా?

స్టార్ మా లో ప్రసారమవుతున్నా రియాలిటీ షో బిగ్ బాస్ గురించి అందరికీ తెలిసిందే.అందులో పాల్గొనే కంటెస్టెంట్ ల గురించి, వ్యక్తిత్వ జీవితాల గురించి సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో ప్రచారం అవుతుందో చెప్పాల్సిన అవసరంలేదు.

 Jabardasth Avinash Remuneration In Bigg Boss4, Mukku Avinash ,remuneration ,bigg-TeluguStop.com

ఇప్పటికే 5 వారాలు పూర్తి చేసుకున్న ఈ షో బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లతో కంటెస్టెంట్ లు బాగా ఆడుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.అయితే వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ముక్కు అవినాష్ గురించి అతను చేసే కామెడీ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

ఈటీవీలో ప్రసారమవుతున్న కామెడీ షో జబర్దస్త్ నుండి పరిచయమైన ముక్కు అవినాష్ ఎంతో అద్భుతంగా కామెడీ చేసి ప్రేక్షకుల నుండి మంచి పేరు సంపాదించుకున్నాడు.ముక్కు అవినాష్ బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనడానికి జబర్దస్త్ నుండి బయటకి రావడానికి ఎన్నో తంటాలు పడ్డారు.

అంతే కాకుండా షో మధ్యలో నుంచి వచ్చినందుకు జబర్దస్త్ యాజమాన్యంకు జరిమానా కూడా కట్టాడు.దీంతో బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా లేటుగా ఎంటర్ అయినా లేటెస్ట్ కంటెస్టెంట్ గా పేరు సంపాదించుకున్నాడు.

ఇదిలా ఉండగా ముక్కు అవినాష్ చేసే కామెడీతో, అలరించే మాటలతో జనానికి ఎంతో పరిచయం కాగా ఇక బిగ్ బాస్ లోకి రాగానే ముక్కు అవినాష్ కి మరింత ఫాలోయింగ్ ఎక్కువైంది.దీంతో బిగ్ బాస్ చూసే ప్రేక్షకులు పెరగగా దీనికి కారణం ముక్కు అవినాష్ అని కొందరు అంటే గంగవ్వ వల్లే ఎక్కువ రేటింగ్స్ వస్తున్నాయని అంటున్నారు.

ఇక అలాంటి ముక్కు అవినాష్ కి బిగ్ బాస్ వారానికి రూ.7 లక్షల పారితోషికం ఇస్తున్నాడట.అతను జబర్దస్త్ కు జరిమానా కట్టిన దానికంటే ఇందులో ఎక్కువగానే పారితోషికం వస్తుంది.బిగ్ బాస్ లో అందరి కంటే లాస్యకు పారితోషకం ఎక్కువగా ఉండగా ప్రస్తుతం ముక్కు అవినాష్ లీడ్ లో ఉన్నాడు.

ఇది ఇలా ఉండగా ముక్కు అవినాష్ కు ఉన్న ఫాలోయింగ్ చూస్తే బిగ్ బాస్ లో తను మరిన్ని వారాలు ఉండి, గెలుపొందే అవకాశం ఉందని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube