తెలుగు బుల్లితెరపై యాంకర్ రష్మి, సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు.గత ఎనిమిది సంవత్సరాల నుండి వీరి బాండ్ కొనసాగుతూనే ఉంది.
అయితే వారిద్దరి మధ్య ప్రేమ ఉన్నట్లు యూట్యూబ్ ఛానల్స్ పెద్ద ఎత్తున వారిపై ట్రోల్ చేస్తూ ఉంటాయి.దీంతో వారిద్దరి మధ్య ఏదో ఉందని ప్రపంచమంతా ఉండే తెలుగు ప్రజలు కొందరు చెవులు కొరుకుంటున్నారు.
అయితే ఈ విషయంపై మాత్రం వీరిద్దరూ ఇప్పటికీ నోరు మెదపలేదు.
ఇక కేవలం జబర్దస్త్ షోలో మాత్రమే కాకుండా బయట వివిధ రకాల కార్యక్రమాలలో, అలాగే ఇతర షోలలో కూడా వీరిద్దరు కలిసి పని చేస్తున్నారు.
వీరిద్దరూ ఎప్పుడు కూడా ప్రేమలో ఉన్నట్లు గా చెప్పలేదు.ఇకపోతే సుడిగాలి సుధీర్ కొన్నిసార్లు మాట్లాడే మాటలు చూస్తే తనకు రష్మీ పై ఎంత ప్రేమ ఉందో ఇట్టే అర్థమయ్యే విధంగా చెబుతుంటాడు.
అలాగే యాంకర్ రష్మి కూడా సుధీర్ అంటే ఇష్టం అన్నట్లుగానే చాలా సార్లు చెప్పకనే చెప్పింది.ఇకపోతే ఈ విషయంలో తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ 300 ఎపిసోడ్ సందర్భంగా జబర్దస్త్ జడ్జి రోజా డైరెక్టుగా సుడిగాలి సుధీర్ ను నిలదీసింది.
ఇక ఈ విషయంలో జబర్దస్త్ స్టేజి మీద రష్మి, సుడిగాలి సుధీర్ ఉండగానే సుడిగాలి సుధీర్ ను రష్మీ పై మీ అభిప్రాయం ఏంటి.? మీ ఇద్దరి మధ్య ఏముంది.? అంటూ రోజా అడిగేసింది.ఈ ప్రశ్నను తాను మీ ఇద్దరి ఫాన్స్ తరుపున అడుగుతున్నట్లు రోజా తెలిపింది.
ఈ ప్రశ్న అడగ్గానే రష్మీ వెంటనే సిగ్గుతో తలదించుకుంది.ఇక రోజా వేసిన ప్రశ్నకు సమాధానంగా సుడిగాలి సుధీర్, రష్మీ అంటే తనకు ఎంతో అభిమానమని, ఎవరి విజయానికైనా ఒక స్త్రీ వెనక ఉంటుందని చెబుతన్నారని కాకపోతే తన విషయంలో రష్మీ ఎప్పుడు పక్కనే ఉంటుందని, రష్మీ తన విజయం అంటూ… 8 ఏళ్ల నుంచి తన పక్కనే ఉంటూ తన విజయంలో సహకరిస్తుంది అంటూ సుధీర్ రష్మీ పై ఉన్న ప్రేమను చెప్పకనే చెప్పేశాడు.
అంతేకాదు సుధీర్ మాట్లాడుతూ సుధీర్ అంటే ఎవరు గుర్తు పట్టకపోవచ్చు కానీ సుధీర్ రష్మీ అంటే వెంటనే గుర్తుపట్టేస్తారు అంటూ తెలిపాడు.దీంతోపాటు ఫ్యాన్స్ కూడా రష్మీ సుధీర్ లు జంటగానే ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు.
అయితే ఈ సంఘటన మొత్తం తాజాగా మల్లెమాల టీవి యూట్యూబ్ ఛానల్ లో విడుదలచేసిన ప్రోమో లో చూపించారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ ప్రోమోను చూసేయండి.