సోషల్ మీడియాలో గుడ్డు పేరిట ప్రపంచ రికార్డు.. అసలు కథ ఏంటంటే...

మన శరీరానికి గుడ్డు మంచి ఆరోగ్యకరమైన ఆహార పదార్థం.ఎన్నో పోషక విలువలు ఉన్న ఆ గుడ్డును అటు పేదలు, ఇటు ధనికులు అని తేడా లేకుండా అందరికీ అందుబాటులో ఉండడంతో ప్రతి ఒక్కరూ దీన్ని తీసుకోవడానికి ఇష్టపడతారు.

 Egg Photo Breaks Kylie Jenner's Record For Most Liked Image,instagram, World Rec-TeluguStop.com

దీంతో శరీరాన్ని పరిపుష్టంగా చేసుకోవచ్చు.అలాంటి ఒక గుడ్డు ఫోటో సోషల్ మీడియాను ఊపేసిదంటే మీరు నమ్ముతారా.? అవును, ఏకంగా ఒక సాధారణ గుడ్డు ఫోటో ప్రపంచ రికార్డును సృష్టించింది.ఇక అందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…

ప్రతిరోజు మనం సోషల్ మీడియాలో ఏదో ఒక ఫోటో లేదా వీడియో వైరల్ అవుతూ ఉండడం చూస్తూనే ఉంటాం.

అయితే ఇంస్టాగ్రామ్ లో ఎక్కువ మంది లైక్ పోస్ట్ చేసిన రికార్డును ఒక గుడ్డు ఫోటో సొంతం చేసుకుంది.world_record_egg అనే పేజీలో పోస్టు చేసిన గుడ్డు ఫోటోను ఏకంగా గత ఏడాది నుండి ఇప్పటివరకు ఐదు కోట్ల నలభై ఎనిమిది లక్షల మంది లైక్ చేశారు.

ఇప్పటికీ చేస్తూనే ఉండటం గమనార్హం.అసలు ఈ గుడ్డు లో చెప్పడానికి ఏమీ లేదు.అయినా కానీ ఈ గుడ్డు కు ఐదు కోట్ల లైకులు పైగా వచ్చాయంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిన విషయమే.ఇంస్టాగ్రామ్ లో భాగా వైరల్ గా మారిన పోస్ట్ ఈ గుడ్డు పోస్ట్.

ఆ ఫోటోలో ఉన్న గుడ్డు పెద్దగా ఏమి తేడా లేదు.కేవలం బ్రౌన్ కలర్ లో ఉన్న ఓ సాధారణ గుడ్డు మాత్రమే.మామూలు ఎవరైనా సెలబ్రిటీలు పోస్ట్ చేస్తే అందుకు సంబంధించి కూడా ఇన్ని లైక్స్ ఎవరికి రాలేదు.కాకపోతే, సెలబ్రిటీలు ఎవ్వరు సాధించలేని అంత రికార్డును ఈ ఫొటో సొంతం చేసుకుంది.

కానీ ఓ సాధారణ గుడ్డు ఫోటో కు ఇంత లైకులు రావడం నిజంగా ఆశ్చర్యపోక మానదు.సోషల్ మీడియా లో ఈ ఫోటో తర్వాత పోస్టులు వరుసగా XXX టెంటసీన్, చద్విక్ బోస్ మ్యాన్ ఉన్నాయి.ఇందుకు సంబంధించి గత సంవత్సరం కైలీ జెన్నర్ పేరుమీద ఉన్న 1.8 లక్షల లైకుల రికార్డును ఎలాగైనా బద్దలు కొట్టాలని ఈ గుడ్డు ఫోటోను పోస్ట్ చేయగా నెటిజన్స్ ఏకధాటిగా ఆ ఫోటోకు లైక్ ల వర్షం కురిపించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube