ఈ చిన్నప్పటి ఫోటోలో కనిపిస్తున్న సింగర్ ఎవరో గుర్తు పట్టారా...?

తన అద్భుత గాత్రంతో తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ప్రముఖ తెలుగు యంగ్ సింగర్ లిప్సిక భాష్యం గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే సింగర్ లిప్సిక ప్రస్తుతం పలు టాలీవుడ్ చిత్రాలు హలో పాటలు పాడుతూనే, మరోవైపు ప్రైవేట్ ఆల్బమ్స్ అలాగే పలు షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటిస్తోంది.

 Did You Recognise These Telugu Singer Lipsika  Lipsika,singer Lipsika,tollywood-TeluguStop.com

అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఇంటిపట్టునే ఖాళీగా ఉంటోంది.దీంతో సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తన అభిమానులతో అందుబాటులో ఉంటోంది.

అయితే తాజాగా సింగర్ లిప్సిక తనకి సంబంధించినటువంటి ఓ ఫోటోని తన అధికారిక  ఖాతా ద్వారా షేర్ చేసింది. అంతేగాక చిన్నప్పటి నుంచి తనకు కథలు అంటే చాల ఇష్టం అంటూ పేర్కొంది.

అయితే ఈ ఫోటో ఒకసారి పరిశీలించినట్లయితే తన చిన్నప్పుడు తీసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.దీంతో సింగర్ లిప్సిక అభిమానులు ఈ ఫోటోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

అంతేగాక ఈ ఫోటోని షేర్ చేసిన కొంతసేపటి లోనే దాదాపు 8 వేల పై చిలుకు లైకులు,  కామెంట్లు వచ్చాయి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే సింగర్ లిప్సిక తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి ఉదయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

దీంతో కరోనా వైరస్ కారణంగా ఎలాంటి సినిమా పనులు లేకపోవడంతో ఇంటి వద్దనే ఉంటూ సెలవులను బాగానే ఎంజాయ్ చేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube