సీఎస్‌కే పై కేకేఆర్‌ జబర్దస్త్‌ విజయం !

ఐపీఎల్‌ లో డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్ కత్తా నైట్ రైడర్స్ ‌ మరో జబర్దస్త్‌ విజయాన్ని సాధించింది.చెన్నై సూపర్ కింగ్స్ ‌ తో జరిగిన మ్యాచ్‌లో కోల్ కత్తా నైట్ రైడర్స్ ‌10 పరుగుల తేడాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

 Csk, Kkr, Dhoni, Dinieshkartik, Rahultripathi,ipl2020-TeluguStop.com

చెన్నై 20 ఓవర్లలో 157 పరుగులు మాత్రమే చేయడంతో నైట్ రైడర్స్ విజయం సాధించింది.చెన్నై మొదట్లో కొంత దూకుడు చూపించినా ఆ తర్వాత ‌ ఏ దశలోనూ తేరుకోనివ్వకుండా చేసి కోల్ కత్తా నైట్ రైడర్స్ విజయకేతనం ఎగురవేసింది.

చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లలో షేన్ వాట్సన్ ‌(50; 40 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) , రాయుడి 30 , మినహా ఎవరు రాణించకపోవడంతో ఓటమి తప్పలేదు.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఏంచుకున్న కోల్ ‌కతా నైట్ ‌రైడర్స్‌ సునీల్‌ నరైన్‌ స్థానంలో రాహుల్‌ త్రిపాఠిని ఓపెనర్‌ గా పంపించింది.

ఈ సందర్భంగా త్రిపాఠి ఓపెనర్ ‌గా మంచి షాట్స్‌ ఆడుతూ తన సత్తా చాటాడు.ఒక్కొక్కరుగా పెవిలియన్ ఏ మాత్రం తడబాటు లేకుండా తాను మాత్రం ఇన్నింగ్స్‌ ఆసాంతం మెరుపులు మెరిపించాడు.

త్రిపాఠి 51 బంతుల్లో 81 పరుగులు సాధించగా.ఇందులో 8ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి కాగా నిర్ణీత ఓవర్లలో 20 ఓవర్లలో కేకేఆర్‌ 167 పరుగులకు ఆలౌట్‌ అయింది.

ఆ తర్వాత ఓ మాదిరి లక్ష్య ఛేదనకి దిగిన చెన్నై.కోల్‌కతా బౌలర్ల పై ఎదురుదాడికి దిగిన వాట్సన్‌ 39 బంతుల్లో 6ఫోర్లు, సిక్సర్‌ సాయంతో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకొని నరైన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు.27 బంతుల్లో 30 పరుగులు చేసిన రాయుడు అవుట్ అయ్యాడు.ఈ దశలో సామ్‌ కరాన్‌తో కలిసి ధోని ఇన్నింగ్స్‌ నిర్మించే ప్రయత్నంలో 16వ ఓవర్లో వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో ధోని క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు.

ఆ తర్వాతి ఓవర్లోనే కరాన్‌ కూడా వెనుదిరగడంతో సీఎస్‌కే ఒత్తిడికి లోనైంది.ఇదే సమయంలో కేకేఆర్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో చెన్నై ఓటమి ఖరారైంది.కేఆర్‌ బౌలర్లలో శివమ్‌ మావి, వరుణ్‌ చక్రవర్తి, సునీల్‌ నరైన్‌, ఆండ్రీ రసెల్‌ తలా ఒక వికెట్‌ తీశారు.కాగా , ఈ విజయంతో కేకేఆర్‌ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకగా.

చెన్నై ఐదో స్థానానికి పడిపోయింది.రాహుల్ త్రిపాఠీ కి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డ్ వరించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube