షాకింగ్ : మాజీ సీబీఐ డైరెక్టర్ ఆత్మహత్య !

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మాజీ డైరెక్టర్, నాగాలాండ్ మాజీ గవర్నర్ అశ్వని కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు.హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రం సిమ్లాలోని తన నివాసంలో బుధవారం ఉరివేసుకుని చనిపోయారు.సిమ్లా పోలీసు సూపరింటెండెంట్ మోహిత్ చావ్లా ఈ విషయాన్ని ధృవీకరించారు.అశ్వనీ కుమార్ మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని చెప్పారు.

 Cbi, Govarner, Excbi Director, Simla, Manipur, Himachalprasad, Aswinikumar-TeluguStop.com

అశ్వని కుమార్‌ 2006 ఆగస్ట్‌ నుంచి 2008 జూలై మధ్యలో హిమాచల్‌ ప్రదేశ్‌ డీజీపీగా పని చేశారు.2008 ఆగస్ట్‌ నుంచి 2010 నవంబర్‌ వరకు సీబీఐ డైరెక్టర్ ‌గా పనిచేశారు.2013లో కొంతకాలం మణిపూర్‌ గవర్నర్ ‌గా, ఆ తరువాత నాగాలాండ్‌ గవర్నర్‌ గా పనిచేశారు.69 ఏళ్ల వయసున్న అశ్వని కుమార్‌ కొంతకాలంగా డిప్రెషన్ ‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.అశ్వని కుమార్ ఆత్మహత్యకు కారణం కూడా ఇదేనని తెలుస్తోంది.

ఆత్మహత్య చేసుకోవడానికి ముందు అశ్వనీ కుమార్ సూసైడ్ లేఖను రాసి ఉంచారు.

జీవిత ప్రయాణంలో అలసిపోయాను.తదుపరి ప్రయాణం కోసం వెళ్లిపోతున్నాను అని ఆయన లేఖలో రాసి ఉన్నట్లు అధికారులు చెప్పారు.

అశ్వని కుమార్ డీజీపీగా పనిచేసిన కాలంలో పోలీసులకు ఓ రోల్ మోడల్ గా ఉండేవారని.ఆత్మహత్య చేసుకోవడం నిజంగా షాకింగ్ పరిణామమని పోలీసు వర్గాలు చెప్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube