బిగ్‌బాస్‌ : ప్రతివారం అందరికంటే ఎక్కువ ఓట్లు ఆయనకే ఎందుకు పడుతున్నాయి?

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభమై ఐదు వారాలు గడుస్తోంది.ఈ ఐదు వారాల్లో ఇప్పటికే సూర్యకిరణ్, కరాటే కళ్యాణి, దేవి మరియు స్వాతి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.

 What Is The Secret Of The Abhijit Voting Big Boss 4, Nagarjuna, Abhijith, Votes,-TeluguStop.com

ఈ వారంలో తొమ్మిది మంది ఎలిమినేషన్ కు నామినేషన్ అయ్యారు.గత వారాల్లో మాదిరిగానే ఈవారం ఎలిమినేషన్ లో ఉన్న అభిజిత్‌ కు ఎక్కువ సంఖ్యలో ఓట్లు రావడం సోషల్ మీడియాలో చర్చనీయాంశం గా మారింది.

గత వారాల్లో ఎక్కువగా అభిజిత్‌ కు ఓట్లు వచ్చాయి అంటూ వార్తలు వచ్చాయి.మొత్తం ఓట్లలో 40 శాతం ఓట్లు అభిజిత్‌ కు వచ్చాయంటూ స్టార్ మా వారి ద్వారా సమాచారం అందుతోంది.

హీరోగా ఏ మాత్రం గుర్తింపు తెచ్చుకోలేక పోయిన అభిజిత్‌ బిగ్ బాస్ లో కూడా పెద్దగా రాణించడం లేదు.అయినా కూడా ఆయనకు ఇంతగా ఎలా ఓట్లు వస్తున్నాయంటూ బిగ్ బాస్ నిర్వాహకులు సైతం జుట్టు పీక్కుంటున్నారట.

ఇంటి సభ్యులు అంతా కూడా అభిజిత్‌ ను ఒకానొక సమయంలో వ్యతిరేకించారు.అయినా కూడా అభిజిత్‌ ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారా అంటే అది కూడా లేదు.

ప్రేక్షకుల నుండి వ్యతిరేకత ఉంది.షో లో పెద్దగా ప్రదర్శన ఇవ్వకుండా కూడా ఓట్ల విషయంలో ఆయన టాప్ లో ఉండటానికి కారణం ఏమై ఉంటుందా అంటూ నిర్వాహకులు మరియు విశ్లేషకులు అంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకీ అసలు విషయం ఏంటి అంటే అభిజిత్ పి ఆర్ టీం చాలా బలంగా ఆయన కోసం సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుందట.అలాగే ఓటింగ్ విషయంలో కూడా ఆయనను సమర్థించేందుకు చాలా పెద్ద టీం రెడీగా ఉందట.

అభిజిత్ గెలిచేందుకు ఆయన సన్నిహితులు చాలానే ఖర్చు పెడుతున్నారట.మొత్తానికి అభిజిత్‌ డబ్బులతో ఓట్లు కొనుగోలు చేస్తున్నాడా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అసలు విషయం ఏంటి అనేది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube