రియా బెయిల్‌ రద్దు సుప్రీంలో సవాల్ : ఎన్సీబీ

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ‌ మరణంతో వెలుగులోకి వచ్చిన బాలీవుడ్‌ డ్రక్స్‌ కేసులో అరెస్టు అయిన రియా చక్రవర్తికి నేడు బాంబే హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.ముంబైలోని బైకుల్లా జైలులో నెల రోజుల పాటు ఉన్న రియాకు లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తు , అలాగే పలు షరతులు విధించి, బెయిల్‌ మంజూరు చేసింది బాంబే హైకోర్టు.

 Reha Bail Canceled Supreme Court Challenge Ncb  Rhea Chakravarthy, Bollywood , S-TeluguStop.com

ఈ నేపథ్యంలో రియా చక్రవర్తి బెయిల్‌ ను సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తామని మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ) వెల్లడించింది.ఈ కేసు వ్యవహారంలో చట్టపరమైన పలు ప్రశ్నలు ఇమిడి ఉన్నాయని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ అనిల్‌ సింగ్ చెప్పారు.

సుశాంత్‌ ఆత్మహత్య కేసులో డ్రగ్స్‌ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఎన్సీబీ సెప్టెంబర్‌ 8న ఆయన రియా చక్రవర్తిని అరెస్ట్‌ చేసింది.అంతకంటే ముందే ఆమె సోదరుడు షోయిక్‌, మేనేజర్‌, పని మనిషి దీపక్ ‌తో పాటు మరికొందరిని ఎన్సీబీ అరెస్ట్‌ చేసింది.

గత నెల 11న రియా బెయిల్‌ పిటిషన్‌ను ఎన్సీపీ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది.దీనితో రియా బాంబే హైకోర్టును ఆశ్రయించగా బుధవారం పలు కండిషన్లు, రూ.లక్ష పూచికత్తుపై బెయిల్‌ మంజూరు చేసింది.వరుసగా పది రోజులపాటు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో రియా హాజరుకావాలని, పాస్‌ పోర్టును అప్పగించాలని ఆదేశించింది.

కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లకూడదన్న షరతులు విధించింది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube