మౌనమేలనోయి జగన్ ?

రాజకీయ ఉరుములు, మెరుపులు, పిడుగులు, భూకంపాలు వస్తున్నా, ఏపీ సీఎం జగన్ మాత్రం ఎక్కడా అదరడం, బెదరడం కానీ చేయడం లేదు.జగన్ ప్రభుత్వ పనితీరు బాగుంది అని ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ రావడంతో పాటు, దేశవ్యాప్తంగా జగన్ పరిపాలన పై చర్చ జరుగుతోంది.

 Jagan Silence On Media And Tdp Coments Jagan Cm, Ysrcp ,ap, Chandrababu, Media,-TeluguStop.com

జగన్ పరిపాలన పై ప్రశంసలు వస్తూనే ఉన్నాయి.అయితే ఆ ప్రశంసలు పూర్తిగా ఆస్వాదించకుండానే జగన్ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీతో పాటు, ఓ వర్గం మీడియా పదే పదే విమర్శలు చేస్తూ, అసత్య కథనాలను ప్రసారం చేస్తూ, ఉండడంతో ఆశించిన స్థాయిలో జగన్ కు క్రెడిట్ దక్కడం లేదు.

పైగా జనాల్లోనూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై చర్చ జరుగుతోంది.

ప్రతిపక్షాలు విమర్శలు చేసిన సందర్భంలో వైసీపీలోని కొంతమంది నాయకులు స్పందిస్తూ, వాటికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా, జగన్ మాత్రం ఎక్కడా నోరు మెదపడం లేదు.

ఆ విమర్శలు విషయంలోనే కాదు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదని, ఏపీలో మాత్రమే అంత మంచి పథకాలను అమలు చేస్తున్నామని గొప్పగా చెప్పుకునే అవకాశం ఉన్నా, జగన్ మాత్రం ఆ విధంగా చేయడం లేదు.మంచి అయినా, చెడు అయినా జగన్ మౌనంగానే ఉంటున్నారు.

అసలు మీడియా సమావేశాలు అంటేనే ఇష్టపడడం లేదు.

Telugu Chandrababu, Coronavirus, Jagan Cm, Modhi, Ysjagan, Ysrcp-Telugu Politica

ప్రజలకు నేరుగా ఏదైనా సందేశం పంపించాలంటే, వీడియో రికార్డ్ చేసి దానిని మీడియాకు విడుదల చేస్తున్నారు తప్ప, నేరుగా మాత్రం మీడియా ముందుకు రావడం లేదు.దీంతో పాటు అనేక వివాదాస్పద నిర్ణయాలను జగన్ తీసుకున్నారు.ఇవన్నీ ప్రజలకు మేలు చేసేవే అయినా, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం వీటిపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ, ప్రభుత్వాన్ని అల్లరి చేస్తోంది.

ఈ సందర్భంగా జగన్ అసలు ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది అనే విషయాన్ని ఎక్కడా చెప్పేందుకు ప్రయత్నాలు చేయడం లేదు.

దేశవ్యాప్తంగా కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న సమయంలోనూ, ఏపీ ప్రభుత్వం ముందుచూపుతో సమర్ధవంతంగా పని చేసింది.

అందరికంటే మంచి పనితీరు కనబరిచింది.ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ విషయాన్ని జగన్ మీడియాకు ప్రజలకు చెప్పుకోవడంలో వెనుకబడ్డారు.

జగన్ ప్రజలకు మంచి చేస్తూ, తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటూ వస్తున్నా, చేసింది చెప్పుకోవడంలో వెనుకబడి పోవడంతో, జగన్ కు దక్కాల్సిన క్రెడిట్ దక్కడం లేనట్టుగానే పరిస్థితి కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube