బిగ్ బాస్ నుంచి నాగార్జున తప్పుకుంటున్నారా..?

బుల్లితెర రియాలిటీ షోలలో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 నాలుగు వారాల క్రితం గ్రాండ్ గా ప్రారంభమైన సంగతి తెలిసిందే.బిగ్ బాస్ సీజన్ 1ను జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, సీజన్ 2కు నాని, సీజన్ 3కు నాగార్జున హోస్ట్ లుగా వ్యవహరించారు.

 Nagarjuna To Quit Bigg Boss, Bigg Boss4, Wild Dog Shooting, Lockdown, Thailand,-TeluguStop.com

బిగ్ బాస్ సీజన్ 4ను హోస్ట్ చేసే అవకాశం నాగార్జునకు రాగా ఆయన తన శైలిలో హోస్ట్ చేస్తూ రికార్డ్ స్థాయిలో టీఆర్పీ రేటింగులు వచ్చేలా చేస్తున్నారు.

అయితే తెలుస్తున్న సమాచారం మేరకు బిగ్ బాస్ షో నుంచి నాగార్జున తప్పుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

మరికొన్ని వారాల పాటు నాగార్జున షోలో కొనసాగినా ఫైనల్ ఎపిసోడ్ సమయానికి మాత్రం నాగార్జున కనిపించరని తెలుస్తోంది.నాగార్జున ప్రస్తుతం బిగ్ బాస్ షో హోస్ట్ చేయడంతో పాటు వైల్డ్ డాగ్ సినిమాలో నటిస్తున్నారు.

వైల్డ్ డాగ్ సినిమాలో కొంత భాగం ఫారెన్ లో చిత్రీకరించాల్సి ఉంది.

ఏప్రిల్ నెలలోనే సినిమా యూనిట్ థాయిలాండ్ కు వెళ్లాల్సి ఉన్నా కరోనా, లాక్ డౌన్ వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది.

షూటింగ్ ఆలస్యమైతే సినిమాపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తోంది.బిగ్ బాస్ నిర్వాహకులతో నాగార్జున దీనికి సంబంధించి చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.

నాగార్జున బదులుగా ఈ షో హోస్ట్ చేయడానికి ఏ స్టార్ హీరో ముందుకొస్తాడో చూడాల్సి ఉంది.

సోషల్ మీడియాలో ప్రస్తుతం నాగార్జున బిగ్ బాస్ షో నుంచి తప్పుకోనున్నారని ప్రచారం జరుగుతోంది.

అయితే నాగార్జున ఈ వార్తను ధృవీకరించాల్సి ఉంది.మరోవైపు బిగ్ బాస్ షో విషయానికి వస్తే నిన్న ఈ షో నుంచి స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ కాగా ఈరోజు షో నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం తెలియాల్సి ఉంది.

ఈరోజు షో నుంచి సోహెల్ లేదా మెహబూబ్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube