వావ్... ఇలాంటి సైకిల్ కం స్కూటర్ ని ఎప్పుడైనా చూశారా...?

తాజాగా కేరళ రాష్ట్రంలో ఉన్న కాయంకులం ప్రాంతంలో నివసిస్తున్న ఇంటర్ విద్యార్థి చేసిన ద్విచక్ర వాహనం అక్కడి స్థానికులలో ఆసక్తిని రేపుతోంది.ఇంటర్ విద్య అభ్యసిస్తున్న సూరజ్ అనే విద్యార్థి హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతున్నాడని అక్కడి పోలీసులు అతన్ని ఆపేశారు.

 Kerala Intermediate Student Sooraj Variety Cycle, Cycle, Scoter, Inter Student I-TeluguStop.com

అయితే తీరా వారి వాహనాన్ని పరిశీలిస్తే… అది స్కూటర్ కాదు సైకిల్ అని పోలీసులు నిర్ధారించుకున్నారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…

కేవలం 5000 రూపాయల ఖర్చుతో ఇంటర్ విద్యార్థి సూరజ్ స్కూటర్ విభాగాలను ఉపయోగించి, వాటితోపాటు పాత సైకిల్ ని కలుపుకొని ఓ ప్రత్యేకమైన సైకిల్ ని తయారు చేసాడు.

ఇక ఈ ప్రత్యేకమైన సైకిల్ లో వెనుకభాగంలో లేడీ బర్డ్ సైకిల్ కి ఉండే వెనుక భాగాన్ని ఉపయోగించగా… ముందు భాగంలో మాత్రం బజాజ్ చేతక్ స్కూటర్ యొక్క హ్యాండిల్ బార్లు, అలాగే రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ బైక్ చైన్ ద్వారా సూరజ్ తన తండ్రి సహాయంతో లాక్ డౌన్ సమయంలో ఈ వాహనాన్ని తయారు చేశారు.ఈ సైకిల్ పెడలింగ్ ద్వారా మాత్రమే ముందుకు కదులుతుంది.

ముందు నుంచి చూస్తే మాత్రం అచ్చం స్కూటర్ నడుపుతున్నారేమో అన్నట్లు భావన కలుగుతుంది.ఈ ప్రత్యేక సైకిల్ కు సింగిల్ సీట్ తో పాటు క్యారియర్ సీటును కూడా ఏర్పాటు చేశారు.

అయితే ఇలా తయారు చేసిన ప్రత్యేక సైకిల్ ని సూరజ్, అతని స్నేహితుడు ఓ రోజు వారి ఇంటి నుండి సైకిల్ పై మన్నార్ కు చేరుకున్నారు.అయితే వారు నడుపుతున్నది సైకిల్ అని తెలియక హెల్మెట్ లేకుండా బండి నడుపుతున్నారని ఆ ప్రాంత పోలీసులు వారిని ఆపేశారు.

తీరా ఆ సైకిల్ ఆగాక అక్కడ ఉన్న వాహనం స్కూటర్ కాదని కేవలం సైకిల్ అని తేలడంతో పోలీసులు సూరజ్ నిర్మించిన ఆ అద్భుతాన్ని పోలీసులు మెచ్చుకొని మరి అక్కడి నుంచి పంపించేశారు.అంతే కాదు అక్కడ కొంతమంది ఆ వెరైటీ సైకిల్ ను చూసి స్థానికులు సెల్ఫీలు కూడా దిగారు.

అలా దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకోగా ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube