40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ మ‌రో యూ ట‌ర్న్‌... రాయ భేర‌సారాలు మొద‌ల‌య్యాయ్‌...!

మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న 40 ఏళ్ల రాజ‌కీయ జీవితంలో లెక్కకు మిక్కిలిగా యూట‌ర్న్‌లు తీసుకున్నారు.ఆయ‌న ప‌దే ప‌దే త‌న‌ది ఫార్టీ ఇయ‌ర్స్ రాజ‌కీయ ఇండ‌స్ట్రీ అని చెప్పుకుంటారే త‌ప్పా… ఆయ‌న రాజ‌కీయ జీవితంలో త‌ప్పిన హామీలు, తీసుకున్న యూట‌ర్న్‌లు బ‌హుశా భార‌త‌దేశ రాజ‌కీయ చ‌రిత్ర‌లోనే ఏ నేత చేసి ఉండ‌డ‌నే చెప్పాలి.

 40 Years Industry Taking U Turn, Negosations Started, Andhra Pradesh, Chandra Ba-TeluguStop.com

ఇక 2014- 19 సంవత్స‌రాల మ‌ధ్య ప‌దే ప‌దే హామీలు ఇవ్వ‌డం, ప్ర‌త్యేక హోదా విష‌యంలో రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టాల‌నుకోవ‌డం లాంటి సంఘ‌ట‌న‌ల త‌ర్వాత బాబు అంటేనే జ‌నాల‌కు విసుగు వ‌చ్చేసింది.చివ‌ర‌కు చంద్ర‌బాబు నిజం చెప్పినా న‌మ్మే ప‌రిస్థితి లేకుండా పోయింది.

ఆయ‌న‌తో ఎవ‌రు క‌లిసి ఉన్నా వాళ్ల‌ను కూడా ప్ర‌జ‌లు న‌మ్మే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతోనే 2014లో బాబుకు స‌పోర్ట్ చేసిన జ‌న‌సేన‌, బీజేపీ ఆయ‌న‌కు దూరం జ‌రిగాయి.ఇక క‌మ్యూనిస్టులు బాబుకు ఎప్పుడో దూరం అయిపోయారు.

గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన బాబు, మోడీని తిడుతూ దేశ‌వ్యాప్తంగా ప్రచారం చేశారు.మోడీని బాబు తిట్ట‌ని తిట్టు అంటూ లేకుండా పోయింది.

అమిత్ షాపై సైతం అంతే స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు.ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డం, అటు మోడీ తిరుగులేని మెజార్టీతో వ‌రుస‌గా రెండోసారి అధికారంలోకి రావ‌డంతో బాబు వెంట‌నే యూట‌ర్న్ తీసుకుని త‌మ పార్టీ రాజ్య‌స‌భ ఎంపీల‌ను బీజేపీలోకి పంపారు.

ఇక ఇప్పుడు మ‌రోసారి తాను బీజేపీతో జ‌ట్టు క‌ట్టేందుకు సిద్ధంగా ఉన్నాన‌న్న సంకేతాలు గ‌త యేడాది కాలంగా పంపుతూనే ఉన్నారు.తాజాగా తిరుప‌తి వైఎస్సార్‌సీపీ ఎంపీ బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ రావు మృతితో అక్క‌డ జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ అడ‌గ‌క‌పోయినా బాబు తాము స‌పోర్ట్ చేస్తామంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వద్దకు రాయబారం పంపారని టీడీపీ నేత‌లు చెపుతున్నారు.

ఒంట‌రిగా పోటీ చేస్తే ఎలాగూ ఉప‌యోగం ఉండ‌దు.క‌నీసం బీజేపీకి స‌పోర్ట్ చేస్తే 2024 ఎన్నిక‌ల నాటికి అయినా బీజేపీ మ‌న‌సు క‌రిగి త‌మ‌తో క‌లుస్తుంద‌న్న ఆశ బాబులో ఇంకా ఉంది.

బీజేపీ మాత్రం చంద్ర‌బాబును ప‌ట్టించుకునే ప‌రిస్థితుల్లో లేదు.

బాబు మాత్రం తిరుప‌తి సీటు ఉప ఎన్నిక‌ల్లో బీజేపీకి స‌పోర్ట్ చేసి అక్క‌డ ఆ పార్టీకి కాసిన్ని ఎక్కువ ఓట్లు వ‌స్తే.

అదంతా త‌న క్రెడిట్ అంటూ ప్ర‌చారం చేసుకునేందుకు పెద్ద ప్లానే వేసిన‌ట్టు తెలుస్తోంది.ఏదేమైనా బీజేపీతో రాయ భేర‌సారాల‌తోనే మ‌రోసారి బాబు యూట‌ర్న్ రాజ‌కీయం బ‌య‌ట‌ప‌డ‌బోతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube