మరో రికార్డు ను సాధించిన హిట్ మ్యాన్...!

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.నిన్నటి మ్యాచ్ మొదలు అవ్వక ముందు 4998 పరుగులు చేసిన రోహిత్ శర్మ, తాజాగా జరిగిన మ్యాచ్ లో కేవలం రెండు పరుగులు చేసిన తర్వాత రోహిత్ శర్మ 5 వేల పరుగులు చేసిన క్లబ్ లో చేరాడు.

 Rohith Sharma, Suresh Raina, Virat Kohili, Mumbai Indians, Kings Xi Punjab-TeluguStop.com

ప్రస్తుతం ఈ 5 వేల పరుగుల క్లబ్ లో రోహిత్ శర్మ మూడవ వ్యక్తిగా చేరాడు.ఇదివరకు ఈ లిస్టులో ముందుగా విరాట్ కోహ్లీ 5430 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, రెండో స్థానంలో సురేష్ రైనా 5368 పరుగులతో ఉన్నాడు.

తాజా మ్యాచ్ లో రోహిత్ శర్మ 5000 పరుగుల మార్కును దాటి 5068 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.ప్రస్తుతం ఐపీఎల్ 13వ సీజన్ లో సురేష్ రైనా ఆడడం లేదు.

దీంతో సురేష్ రైనా, రోహిత్ శర్మ మధ్యలో ప్రస్తుతం కేవలం 300 పరుగులు మాత్రమే వ్యత్యాసం ఉంది.ఈ సీజన్ ముగిసే సమయానికి రోహిత్ శర్మ సురేష్ రైనా ను దాటేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

ఇక తాజాగా జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 13వ సీజన్లో రెండో విజయాన్ని అందుకుంది.కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుపై 48 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది.

మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు 191 పరుగులను సాధించింది.ఇందులో మొదటి 10 ఓవర్లు ఆచితూచి ఆడిన ముంబై ఇండియన్స్ జట్టు సభ్యులు ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు.

ఇందులో రోహిత్ శర్మ అత్యధికంగా 45 బంతుల్లో 77 పరుగులు చేయగా, చివర్లో పొలార్డ్ హార్దిక్ పాండ్యా సిక్సర్ల వర్షం కురిపించారు.దీంతో ముంబై ఇండియన్స్ జట్టు 4 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేయగలిగింది.

ఆ తర్వాత 192 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కింగ్స్ పంజాబ్ జట్టు ఎక్కడా కూడా లక్ష్యాన్ని ఛేదించే దిశగా అడుగులు వేయలేదు.మొదటగా పవర్ ప్లే సమయం వరకు బాగానే ఆడిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు సభ్యులు ఆ తర్వాత ముంబై ఇండియన్స్ బౌలర్ల దెబ్బకి చేతులు ఎత్తేసారు.

ఇక నిర్ణిత 20 ఓవర్లు ముగిసే సమయానికి ఎనిమిది వికెట్లు కోల్పోయి కేవలం 143 పరుగులు చేయగలిగింది.దీంతో ముంబై ఇండియన్స్ జట్టు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ పై 48 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube