సైకో తరహా పాత్రలపై ఆసక్తి చూపిస్తున్న రాజ్ తరుణ్

ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నటుడు రాజ్ తరుణ్.ఈ కుర్ర హీరో కెరియర్ ఆరంభంలో వరుసగా హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకొని మంచి ఈజ్ చూపించాడు.

 Young Hero Ready To Play Negative Roles, Tollywood, Telugu Cinema, Orey Bujjiga-TeluguStop.com

అదే జోరు నెక్స్ట్ సినిమాల విషయంలో కూడా కొనసాగుతుందని అనుకుంటే ఒక్కసారిగా బోర్లా పడ్డాడు.కథ ఎంపికలో తేడా కొట్టడంతో వరుసగా రాజ్ తరుణ్ చేస్తున్న సినిమాలు అన్ని కూడా ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి.

ఈ మధ్యకాలంలో ఇతని సినిమాల పరిస్థితి మరీ తీసికట్టుగా తయారైంది.అయినా కూడా అవకాశాలు బాగానే వస్తున్నాయి.

తాజాగా ఒరేయ్ బుజ్జిగా సినిమాతో ఆహా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.ఈ సినిమా మీద అప్పుడే డివైడ్ టాక్ వచ్చేసింది.

రొటీన్ గా సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉందనే అభిప్రాయం వస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా రాజ్ తరుణ్ తన అభిప్రాయాలని పంచుకున్నారు.

హీరో పాత్రలు మాత్రమే కాకుండా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించాలని తనకి ఎప్పటి నుంచో ఉందని చెప్పుకొచ్చాడు.వాలి సినిమాలో అజిత్, ప్రేమ చదరంగం సినిమాలో భరత్ చేసిన పాత్రల తరహాలో సైకోయిజం చూపించే క్యారెక్టర్స్ చేయాలని ఉందని తెలిపాడు.

అలాగే మంచి కథ అయితే వెబ్ సిరీస్ లో నటించడానికి కూడా ఒకే అని చెప్పాడు.అయితే అలాంటి నెగిటివ్ పాత్రలతో తన దగ్గరకి ఎవ్వరూ రావడం లేదని, వస్తే కచ్చితంగా చేస్తానని చెప్పాడు.

ప్రస్తుతం శ్రీ‌నివాస్ గవిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఒక సినిమా, సంతోష్ అని నూత‌న ద‌ర్శ‌కుడితో ఒక సినిమా చేయాల్సి ఉంది.సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌లో డ్రీమ్ గ‌ర్ల్ రీమేక్ చేస్తున్నట్లు తెలిపాడు.

వీటితో పాటు మ‌రో రెండు క‌థ‌లు లాక్ చేసి పెట్టానని క్లారిటీ ఇచ్చాడు.మొత్తానికి రాజ్ తరుణ్ కెరియర్ లో ఫ్లాప్ లు పడుతున్నా కూడా ఏకంగా ఐదు ప్రాజెక్ట్ ల వరకు కుర్ర హీరో లైన్ లో పెట్టడం నిజంగా విశేషమని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube