వామ్మో... కరోనా సోకితే శరీరానికి అంత ప్రమాదమా..?

దేశంలో ఏడు నెలల నుంచి విజృంభిస్తోన్న కరోనా మహమ్మారిపై ప్రజల్లో గతంతో పోలిస్తే భయం కొంత తగ్గింది.కరోనా కేసుల సంఖ్య, మరణాల రేటు కూడా క్రమంగా తగ్గుతోంది.

 Covid 19 Infects Various Organs In The Body Says Study  Coronavirus, Human Organ-TeluguStop.com

వైరస్ నెమ్మదిగా అదుపులోకి వస్తుందని.భారత్ లో వైరస్ వ్యాప్తి తీవ్రత క్రమంగా తగ్గుతోందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

మరోవైపు వైరస్ గురించి, వ్యాక్సిన్ గురించి శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో వెలుగులోకి వస్తున్న విషయాలు ప్రజలను మరింత టెన్షన్ పెడుతున్నాయి.

శాస్త్రవేత్తలు కరోనా వైరస్ ఒకసారి సోకితే మళ్లీ సోకదని అనుకోవడానికి వీలులేదని శరీరంలో యాంటీబాడీలు తగ్గితే మళ్లీ వైరస్ బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

60 నుంచి 90 రోజులు మాత్రమే యాంటీబాడీలు శరీరంలో ఉంటాయని.కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా సంవత్సరానికి ఒకసారి వ్యాక్సిన్ వేయించుకోక తప్పదని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

ఇదే సమయంలో శాస్త్రవేత్తలు కరోనా సోకితే భవిష్యత్తులో సైతం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని వైరస్ ఒళ్లు గుల్ల చేస్తుందని వెల్లడిస్తున్నారు. శరీరంలోని అన్ని అవయవాలపై వైరస్ ప్రభావం చూపుతుందని.

కిడ్నీ, రక్తం, మెదడు, కండరాలు, గుండెలపై తీవ్ర ప్రభావం చూపుతోందని.అణువణువునూ కబళిస్తోందని.

వైరస్ ఒక్కొక్కరిని ఒక్కో విధంగా ఇబ్బందులు పెడుతోందని వెల్లడిస్తున్నారు.

కరోనా లక్షణాలు లేని వారిలో కిడ్నీ సమస్యలు, పక్షవాతం, చెస్ట్ పెయిన్ లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయని మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

శరీరంలో పలు అవయవాలకు కరోనా వైరస్ అతుక్కుని ఆ అవయవాలను పీల్చి పిప్పి చేస్తోందని చెబుతున్నారు.కొందరు శాస్త్రవేత్తలు కరోనా చర్మంపై కూడా ప్రభావం చూపుతుందని కరోనా లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంత వరకు జాగ్రత్తలు తీసుకోవడం మినహా వైరస్ సోకకుండా మరో మార్గం లేదని చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube