భారత సంతతి శాస్త్రవేత్త ఘనత..అద్భుతమంటున్న నిపుణులు...!!

భారత దేశం నుంచీ ప్రపంచ దేశాలలో పలు దేశాలకు కోట్లాది మంది భారతీయులు వలసలు వెళ్ళారు.ఇలా వలసలు వెళ్ళిన వారిలో చాలా మంది ఉద్యోగాల కోసం, వ్యాపారాలను విస్తృతం చేయడం కోసం, ఉన్నతమైన చదువుల కోసం వెళ్లి ఆయా దేశాలలో స్థిరపడిపోయారు.

 Indian-american Dr. Saurabh Mehta Led Research Team Wins Nih Challenge Prize,nat-TeluguStop.com

ఇలా స్థిరపడిన ఎంతో మంది తమ అత్యున్నతమైన ప్రతిభతో కీర్తి శిఖరాలు చేరుకుంటున్నారు.భారతీయుల ప్రతిభాపాటవాలను చాటి చెప్తున్నారు.

చరిత్రలను తిరగ రాస్తున్నారు.ముఖ్యంగా అమెరికా వంటి అగ్ర రాజ్యంలో భారతీయుల ప్రతిభకి పట్టం కడుతుంటారు.

తాజాగా

అమెరికాలోని కార్నెల్ వర్సిటీకి చెందిన భారత సంతతి శాస్త్రవేత్త సౌరభ్ మెహతా ఏళ్ళుగా శ్రమించి చేసిన ఓ అద్భుతమైన ఆవిష్కరణ అదరి మన్ననలు అందుకుంటోంది.కేవలం లాలాజలం పరీక్ష ద్వారా వ్యాధులను, పోష్టిక ఆహార లోపాన్ని గుర్తించి ముందుగానే జాగ్రత్త పడేలా సౌరభ్ మెహతా తన బృందం ఆధ్వర్యంలో పరిశోధించి ఫోన్ ద్వారా నిర్ధారించగల టెక్నాలజీని ఆవిష్కరించారు.

దాంతో ఈ ఆవిష్కరణ కి విశేషమైన గుర్తింపు లభించింది.దాంతో.

టెక్నాలజీ యాక్సిలేటర్ ఛాలెంజ్ ప్రైజ్ కు ఈ పరిశోధన ఎంపిక అయ్యింది.అంతేకాదు సుమారు రూ.73 లక్షల ఫ్రిజ్ ను నిర్వాహకులు సౌరభ్ టీమ్ కు అందించారు.సౌరభ్ మాట్లాడుతూ టెక్నాలజీ లేని ప్రాంతంలో కూడా ఈ పద్దతిని అనుసరించి లాలాజల బయోవర్కర్ల ఆధారంగా మలేరియా, ఐరన్ లోపాలను గుర్తించగలగడం దీని ప్రత్యేకతగా తెలిపారు.

ఈ టెక్నాలజీ ద్వారా కేవలం 15 నిమిషాల్లో రిజల్ట్స్  అందిస్తుందని సౌరభ్ ప్రకటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube