చెస్ దిగ్గజం ఫస్ట్ స్పాన్సర్ ఎస్పీ బాలునే

గాన గాంధర్వుడు, సంగీత సరస్వతి ఎస్పీ బాలుకి చిత్ర పరిశ్రమతో ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరితో ఆయనకీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

 Viswanathan Anand Recalls Sp Balu As His First Sponsor, Tollywood, South Cinema,-TeluguStop.com

అయితే ఆయన మరణం తర్వాత ఇప్పటి వరకు ఎవరికీ తెలియని విషయాలు కొన్ని బయటకి వచ్చాయి.తాజాగా ఇండియన్ చెస్ దిగ్గజం

విశ్వనాథన్ ఆనంద్

బాలు తో తనకున్న అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు.

13 ఏళ్ల విశ్వనాథన్ ఆనంద్ మద్రాస్ కోల్ట్స్ జూనియర్ చెస్ టీమ్ లో సభ్యుడు గా ఉన్న సమయంలో ఐఐటీ బాంబే నిర్వహిస్తున్న నేషనల్ టీమ్ చాంపియన్ షిప్​కు తమ జూనియర్ టీమ్ ను పంపాలని మద్రాస్ డిస్ట్రిక్ట్​ చెస్ అసోసియేషన్ భావించింది.కానీ అందుకు డబ్బులేకపోవడంతో ఆ ఆలోచన విరమించుకుంది.

ఆ టైమ్ లో ఎస్పీ బాలు ముందుకొచ్చి మద్రాస్ కోల్ట్స్ టీమ్ కు స్పాన్సర్ షిప్ అందించారు.

అలా ఆనంద్ కు తొలి స్పాన్సర్ ఎస్పీ బాలు అయ్యారు.

ఆరుద్ర రచించిన ఓ పాట రికార్డింగ్ కోసం ఎస్పీబాలు చెన్నైలోని విజయ గార్డెన్స్ స్టూడియోకు వచ్చారు.అప్పుడు ఆరుద్ర కారణం చెప్పకుండా బ్లాంక్ చెక్ పై బాలుతో సంతకం చేయించుకున్నారు.

ఆ డబ్బును ఆరుద్ర మద్రాస్ కోల్ట్స్ టీమ్ కోసం ఉపయోగించారు.ఎస్పీబీ అందించిన ఆ సహకారంతో టోర్నీబరిలోకి దిగిన ఆనంద్ తొమ్మిది సార్లు నేషనల్ చాంపియన్ అయిన మౌనిల్ ఆరోన్ ను ఓడించాడు.

దాంతో పాటు మద్రాస్ టీమ్ కూడా విజేతగా నిలిచింది.ఆ తర్వాత ఆనంద్ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా విశ్వవిజేత స్థాయికి చేరాడు.

అలా ఎస్పీబీ కారణంగా ఈ రోజు విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ దిగ్గజ చెస్ చాంపియన్ అయ్యాడని చెప్పాలి.ఈ విషయాన్ని ఆనంద్ గుర్తుచేసుకుంటూ తాను ఈ రోజు ఈ స్థాయికి రావడానికి కారణం కచ్చితంగా ఎస్పీ బాలు అని భావోద్వేగానికి గురయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube