ఈ ఫోటోలో మాస్క్ ధరించి ఉన్న హీరో ఎవరో గుర్తు పట్టండి చూద్దాం..?

తెలుగులో ప్రముఖ దర్శకుడు  రిషి దర్శకత్వం వహించిన “ప్రేమతో మీ కార్తీక్” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయమై ఆర్ఎక్స్ 100 అనే చిత్రంలో అద్భుత నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న  టాలీవుడ్ యంగ్ హీరో “కార్తికేయ గుమ్మకొండ” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే హీరో కార్తికేయ ఈ మధ్యకాలంలో హీరో తరహా పాత్రలలోనే కాకుండా కొంతమేర నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలో కూడా నటిస్తూ సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నాడు.

 Did You Recognise These Tollywood Young Hero Who Is In Mask,  Karthikeya, Tollyw-TeluguStop.com

అయితే తాజాగా హీరో కార్తికేయ మాస్క్ ధరించి సినిమా షూటింగ్ కి హాజరవుతున్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.దీంతో తమ అభిమాన నటుడు సినిమా షూటింగులకు హాజరవుతుండడంతో ఆ ఫోటోని తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో బాగానే షేర్ చేస్తూ ట్రెండింగ్ చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కార్తికేయ తెలుగులో “చావు కబురు చల్లగా” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.కాగా ఈ చిత్రంలో కార్తికేయ కి జోడిగా అందాల రాక్షసి మూవీ ఫేమ్ లావణ్య త్రిపాటి నటిస్తోంది.

అలాగే ఈ చిత్రానికి కౌశిక్ దర్శకత్వం వహిస్తుండగా టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత బన్నీవ్యాస్  నిర్మిస్తున్నాడు.కాగా ఇటీవలే కార్తికేయ మరో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

 అయితే ఈ చిత్రంలో కార్తికేయ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో బలంగా వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube