రకుల్ విచారణ.. టెన్షన్ లో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు డ్రగ్స్ విచారణ కేసులో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.నిన్న మొదట తనను ఎన్సీబీ అధికారులు సంప్రదించలేదని, సమన్లు అందలేదని చెప్పిన రకుల్ ఆ తర్వాత మాట మార్చింది.

 Tollywood Star Director Krish Worries About Rakul Preet Singh Rakul Preeth Sing-TeluguStop.com

తనకు సమన్లు అందాయని విచారణకు హాజరు కాబోతున్నానని వెల్లడించింది.అయితే రకుల్ డ్రగ్స్ కేసు విచారణతో ఒక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది.

నిజానికి స్పైడర్ సినిమా ఫ్లాప్ తరువాత స్టార్ హీరోయిన్ గా ఇమేజ్ ఉన్నప్పటికీ రకుల్ కు పెద్దగా అవకాశాలు లేవు.ప్రస్తుతం రకుల్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో వైష్ణ‌వ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది.

చాలా తక్కువ సమయంలో ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి సాధారణ పరిస్థితులు ఏర్పడిన వెంటనే విడుదల చేయాలని క్రిష్ భావిస్తున్నారు.అయితే డ్రగ్స్ రూపంలో ఈ సినిమాకు అనుకోని అవాంతరం ఏర్పడింది.

ఇప్పటికే ఈ సినిమాకు రకుల్ డేట్స్ కేటాయించింది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

నెలన్నర వ్యవధిలో షూటింగ్ మొత్తం పూర్తయ్యే విధంగా క్రిష్ ప్లాన్ చేసుకున్నారు.అయితే అధికారుల విచారణ కోసం రకుల్ మరికొన్ని రోజుల పాటు ముంబైలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

ఆరోపణలు నిజమని తేలితే రకుల్ ను అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.దీంతో అనుకున్న సమయానికి షూట్ పూర్తయ్యేలా లేదని క్రిష్ టెన్షన్ పడుతున్నారు.

ఒకవైపు కరోనా, లాక్ డౌన్ వల్ల పలు ఇబ్బందులు ఉన్నా క్రిష్ ఎంతో కష్టపడి షూటింగ్ ప్లాన్ చేసుకోగా ఇప్పుడు రకుల్ విచారణ వల్ల షెడ్యూల్ వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొంది.ఈ సినిమా పూర్తైన తరువాత పవన్ సినిమా కోసం క్రిష్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేయాల్సి ఉంది.

ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైతే ఆ ప్రభావం పరోక్షంగా పవన్ క్రిష్ ప్రాజెక్ట్ పై పడనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube