ఎఫ్3 లో మెయిన్ హీరోయిన్ తానే అంటున్న మెహరీన్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన ఫామిలీ కామెడీ ఎంటర్టైనర్ ఎఫ్2.ఈ సినిమా సంక్రాంతి బరిలో వచ్చి ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.

 Mehreen Pirzada Hopes On F3 Movie, Tollywood, F2 Sequel, Director Anil Ravipudi,-TeluguStop.com

కుటుంబ కథలలో కామెడీ మిస్ అయినా ప్రేక్షకులకి ఈ సినిమా ఫుల్ మీల్స్ లా దొరికింది.అందరిని కడుపుబ్బా నవ్వించింది.

అనిల్ రావిపూడి కెరియర్ లో ఎఫ్2 మరో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది.ఇక ఇందులో తమన్నా, మెహరీన్ హీరోయిన్స్ గా నటించారు.

ఆధ్యాంతం ప్రేక్షకులని అలరించిన ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు అనిల్ రావిపూడి ఎప్పుడో ప్రకటించాడు.దీనికి సంబంధించి ఒక లైన్ కూడా అనుకున్నట్లు తెలిపాడు.

ఈ సరి ముగ్గురు హీరోలతో డబల్ ఫన్ అందిస్తానని తెలియజేశాడు.తరువాత అనిల్ రావిపూడి మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరో సక్సెస్ ని ఖాతాలో వేసుకున్నాడు.
ఈ మధ్య ఎఫ్3 సినిమా గురించి అనిల్ తో పాటు వెంకటేష్ కూడా కన్ఫర్మ్ చేశారు.ఇదిలా ఉంటే ఇక తాజాగా ఎఫ్2లో వరుణ్ తేజ్ కి జోడీగా నటించిన మెహరీన్ ఈ సినిమా గురించి కీలక అప్డేట్ ఇచ్చింది.ఎఫ్3 సినిమాలో తాను కూడా ఉంటానని, మొదటి సినిమాలో ఉన్న మా జోడీలు సీక్వెల్ లో కూడా ఉంటాయని చెప్పుకొచ్చింది.ప్రస్తుతం మెహరీన్ చేతిలో పెద్దగా సినిమాలు లేవు.

ఆమె కెరియర్ ముగిసిపోయే దశకి వచ్చేసిందని అందరూ భావిస్తున్నారు.ఇలాంటి సమయంలో ఈ అమ్మడు మాటల బట్టి ఎఫ్3 మీద చాలా హోప్స్ పెట్టుకుందని అర్ధమవుతుంది.

మరి మెహరీన్ కి లైఫ్ ఇవ్వడానికైనా అనిల్ రావిపూడి ఈ సినిమాని ఎప్పుడు మొదలు పెడతాడు అనేది స్పష్టం చేస్తే బాగుంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube