ఒకప్పటి ఈ హీరోయిన్ మీకు ఇంకా గుర్తుందా..?

తెలుగులో అప్పట్లో ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించిన “ఐతే.!”  చిత్రం తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయిన “ముంబై బ్యూటీ సింధు తులాని” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే సింధు తులాని ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలలో హీరోయిన్ గా నటించి తెలుగు సినీ ప్రేక్షకులని బాగానే అలరించింది.అలాగే అప్పుడప్పుడు కొంతమేర నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలలో కూడా కనిపించి సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలే అందుకుంది.

 Do You Remember These Tollywood Yesteryear Heroine Sindhu Tolani,  Sindhu Tolani-TeluguStop.com

ఈమె నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలో నటించిన చిత్రాలలో “మన్మధ” చిత్రం మంచి గుర్తింపు తెచ్చింది.

అయితే కొంతకాలం పాటు హీరోయిన్ గా సింధు తులాని బాగానే రాణించినప్పటికీ తన తదుపరి చిత్రం కథల విషయంలో కొంత మేర అవగాహన లోపించడంతో ఈ అమ్మడు హీరోయిన్ గా నటించిన చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి.

 దీంతో ప్రస్తుతం సింధు తులాని క్యారెక్టర్ ఆర్టిస్ట్ తరహా పాత్రలో నటిస్తోంది.కాగా ఆ మధ్య టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించినటువంటి  సన్ ఆఫ్ సత్యమూర్తి అనే చిత్రంలో హీరో వదిన పాత్రలో నటించింది.

అయితే చివరిగా సింధు తులాని తెలుగులో చిత్రాంగద అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు ఆమె తెలుగులో నటించిన లేదు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా సింధు తులానీ హీరోయిన్ గా నటించిన  “అతనొక్కడే, గౌతమ్ ఎస్.ఎస్.సి, హరే రామ్, బతుకమ్మ, తదితర చిత్రాలు ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నాయి.ఇక సినిమాల్లో హీరోయిన్ అవకాశాలు తగ్గిపోయిన తర్వాత గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలలో కూడా సింధు తులాని నటించింది.

ప్రస్తుతం సింధు తులాని తన కుటుంబ సభ్యులతో కలిసి ముంబైలో నివాసం ఉంటున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube