మోనాల్ కోసం పోటీ ప‌డుతున్న జబర్దస్త్ అవినాష్.. ట్విస్ట్ ఏంటంటే?

బుల్లితెర ప్రేక్ష‌కులకు వినోదాన్ని పంచే తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ మూడు సీజ‌న్లు పూర్తి చేసుకుని.ఇటీవ‌ల నాల్గువ సీజ‌న్‌లోకి అడుగుపెట్టింది.

 Jabardasth Avinash Monal Gajjar Love Track! Jabardasth Avinash, Monal Gajjar, Lo-TeluguStop.com

సెప్టెంబ‌ర్ 6న కింగ్ నాగార్జున్ హోస్ట్‌గా ప్రారంభ‌మైన బిగ్ బాస్ ‌షోలోకి మొత్తం 16 మంది కంటెస్టెంట్లు గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు.ఇక ఇటీవ‌ల తొలివారం కూడా పూర్తి చేసుకోగా.

స‌త్యం ద‌ర్శ‌కుడు సూర్య కిర‌న్ మొద‌ట‌ ఎలిమినేట్ అయ్యారు.

ఆయ‌న ప్లేస్‌ను రీప్లేస్ చేస్తూ వైల్డ్ కార్డు ద్వారా కుమార్ సాయి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

మ‌రోవైపు రెండో వారంలో బిగ్ బాస్ ఇంటి స‌భ్యులు త‌మ‌దైన శైలిలో ఆక‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.ఇక ముందు సీజ‌న్ల మాదిరిగానే ఈ సీజ‌న్‌లో కూడా ఎఫైర్లకు కేంద్రంగా మారింది.

ప్ర‌తి చిన్న విష‌యానికి ఏడ్చే మొనాల్ గజ్జర్ కోసం.అఖిల్‌, అభిజిత్ లు కొట్లాడుకునే పరిస్థితికి వస్తున్నారు.

అఖిల్-మొనాల్-అభిజిత్‌ల మధ్య ట్రై యాంగిల్ లవ్ స్టోరీతో.షో ర‌స‌వ‌త్త‌రంగా మారింది.అయితే ఇలా త‌రుణంలో మ‌రో ట్విస్ట్ చోటుచేసుకుంది.బిగ్ బాస్ హౌస్‌లోకి గురువారం రెండో వైల్డ్ కార్డ్ ద్వారా జబర్దస్త్ అవినాష్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు.

జోకర్ వేషంతో ఇంట్లోకి వచ్చి అందరినీ సర్‌ప్రైజ్ చేసిన అవినాష్‌కు.ఇంటి సభ్యుల ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.
అయితే హౌజ్‌లోకి అడుగుపెట్టిన జబర్దస్త్ అవినాష్.వెంటనే మోనాల్ గజ్జర్‌తో పులిహోర కలిపేందుకు ప్ర‌య‌త్నించారు.ఈ క్ర‌మంలోనే మొనాల్ దగ్గరకు వెళ్లి.నీకు నేను పెద్ద అభిమాని‌ని అని ఇంగ్లీష్‌లో మాట్లాడటానికి నానా ప్ర‌య‌త్నాలు చేశారు.

అంతేకాకుండా.తనకు పెద్ద కుటుంబం ఉందని, తన గురించి ఆలోచించాలంటూ మోనాల్‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు.

దీంతో మోనాల్‌ కోసం అఖిల్‌, అభిజిత్ ల‌తో పాటు అవినాష్ కూడా పోటీ ప‌డేందుకు సిద్ధం అయ్యాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube