ఈనెల చివరి నుండి క్రెడిట్, డెబిట్ కార్డులకు కొత్త రూల్స్...!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డెబిట్, క్రెడిట్ కార్డుల లకు సంబంధించి మార్పులు చేసింది.ఇకపోతే ఈ కొత్త రూల్స్ సెప్టెంబర్ 30 నుండి అమల్లోకి రాబోతున్నాయి.

 New Rbi Rules For Debit And Credit Cards ,new Rules, Credit Card, Debit Card, On-TeluguStop.com

ఇందుకు సంబంధించి క్రెడిట్, డెబిట్ కార్డులు ఉపయోగిస్తున్న కస్టమర్స్ ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ కొత్త నియమాలను తెలుసుకోవడం ఎంతగానో ఉపయోగపడుతాయి.ఇక కొత్త నిబంధనలు ఒకసారి చూస్తే… అంతర్జాతీయ లావాదేవీలు, ఆన్లైన్ లావాదేవీలు, కాంటాక్ట్ లెస్ కార్డ్ లావాదేవీలను పూర్తిగా నిలిపివేయడం తిరగనుంది.

ఇకపోతే ఇందుకోసం వినియోగదారుడు కోరుకున్న సమయంలో ప్రాధాన్యత చేసుకొనే విధంగా బ్యాంకు వినియోగదారులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇలా బ్యాంకు అధికారులకు దరఖాస్తు చేసుకున్న తర్వాత వాటిని బ్యాంకు అధికారులు అనుమతి చేసిన వెంటనే లావాదేవీలు జరుగుతాయని రిజర్వు బ్యాంకు తెలియజేసింది.

అంతేకాదు పిఓఎస్ టర్మినల్స్ వద్ద కూడా ఎలాంటి విదేశీ లావాదేవీలను అనుమతించవద్దని, పిఓఎస్ ఏటీఎం నుండి నగదు ఉపసంహరించుకునే సమయంలో కూడా లావాదేవీలు నిలిపివేయాలని సూచించింది.ఇకపోతే కార్డు కలిగి ఉన్న వ్యక్తి ఏ సమయంలోనైనా సేవను సర్దుబాటు చేసుకోవడానికి లేదా తొలగించుకోవడానికి అధికారం కలిగి ఉంటారు.

ఇందుకు సంబంధించి కస్టమర్ లావాదేవీల పరిమితిని రోజులో ఎప్పుడైనా మార్చుకోవచ్చని ఆర్బిఐ తెలిపింది.

ఇక కార్డు కలిగి ఉన్న వ్యక్తి తన కార్డు పరిమితిని ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్, ఎటిఎం మెషిన్, ఐవిఆర్ ద్వారా కూడా ఎప్పుడైనా మార్చుకునే వెసులుబాటును కలిగింది.

అయితే ఈ నియమాలను కరోనా వైరస్ రాకముందే తయారు చేసినప్పటికీ వాటిని అమలు పరచలేకపోయారు.ఇక తాజాగా కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో సెప్టెంబర్ 30 నుండి ఈ కొత్త రూల్స్ అమల్లోకి తీసుక రానుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube